మే నెలాఖరు వరకు లాక్ డౌన్…?

రాష్ట్ర ప్రభుత్వ బాటలోనే కేంద్రం

కేంద్రం మూడవ విడత లాక్ డౌన్ ఆదివారంతో ముగియనుండడంతో తిరిగి లాక్ డౌన్ ను మే 30 వరకు కొనసాగించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం మే29 వరకు లాక్ డౌన్ విదించగా కేంద్రం దీనిని మే నెలాఖరు వరకు పొ డిగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత కఠినంగ నిర్ణయాలు తీసుకున్న కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతున్న నేపధ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ప్రజలకు ఎ లాంటి ఇబ్బంది కలగకుండా గ్రీన్, ఆరెంజ్ జొన్లలో కొన్ని సడలింపు ఇవ్వనున్నట్లు తెలియవచ్చింది. లాక్ డౌన్ పెంపుపై ఆదివారం లోగా కేంద్ర ప్రభుత్వం అధిారికంగా ప్రకటన చేయనుంది.

మే నెలాఖరు వరకు లాక్ డౌన్...?- news10.app

రాష్ట్రంలో ఎలా…?

లాక్ డౌన్ పొడిగింపు విషయంలో నిర్ణయం కేంద్రం రాష్ట్రాలకే వదిలేయగ రాష్ట్రం ఏం నిర్ణయం తీసుకుంటుందని ప్రజలు ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. సోమవారం కల్ల ఈ విషయంలో స్పష్టత ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆధారంగా మార్గదర్శకాలను అనుసరించి నిర్ణయం ఉంటుందని కేసీఆర్ ప్రకటించారు. శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆటో మొబైల్, ఏ సి అమ్మకాల దుకాణాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపును ఇచ్చారు. కేంద్రం నిర్ణయం తర్వాత మరిన్ని సడలింపు రాష్ట్రం ఇవ్వనుందని తెలిసింది. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా కాస్త కంట్రోల్లో ఉండగా నిత్యం పాజిటివ్ కేసులు జిహెచ్ఎంసి పరిధిలోని నమోదు అవుతుండగా గ్రీన్ జోన్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో లాక్ డౌన్ లో సడలింపు రానుందని కొందరు భావిస్తున్నారు. ఏదిఏమైనా కేంద్రం తీసుకున్న నిర్ణయం తర్వాత రాష్ట్రం ఏం నిర్ణయం తీసుకొనుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.