ప్రజల చేతిలో శిక్ష తప్పదు…

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మావోయిస్టు పార్టీ హెచ్చరిక
లేఖ విడుదల మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మావోయిస్టు దళాలపై చేస్తున్న దాడులను ఆపకపోతే ప్రజల చేతిలో శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. శుక్రవారం ఆయన ఆడియో సందేశాన్ని, లేఖను మీడియాకు విడుదల చేసారు. ఈ లేఖలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై జగన్ విరుచుకుపడ్డారు. కరోనా మహమ్మారి ప్రజలను హతమార్చుతున్న ఈ కాలంలో మావోయిస్టు పార్టీ భౌతిక దాడులకు పాల్పడకుండా స్వియనియంత్రణ పాటిస్తుంటే కేసీఆర్, నరేంద్రమోదీ ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల నిర్ములనే లక్ష్యంగా దాడులు చేయడాన్ని ఖండించాలన్నారు.

ప్రజల చేతిలో శిక్ష తప్పదు...- news10.app

రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మల్లెపల్లి తొగు అడవుల్లో, కొమురంభీం అసిఫాబాద్ జిల్లా తొక్కాగుడా అడవుల్లో దళాలపై గ్రేహౌండ్స్ బలగాలతో దాడులు చేయడాన్ని, ప్రజలను అరెస్ట్ చేయడాన్ని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ఖండించాలన్నారు. ఉపా, ఎన్ ఐ ఎ కేసులను ఎత్తివేయాలని జగన్ డిమాండ్ చేశారు.