ఆదర్శ గ్రామంలో… అనుమతి లేని వెంచర్లు

గీసుగొండ మండలంలో అడ్డగోలు వెంచర్లు
ఆదర్శ గ్రామం గంగదేవిపల్లి లో అనుమతిలేని రియల్ వ్యాపారం
నాలకన్వర్షన్,కుడా అనుమతులు నిల్
నేను చెపితే చాలు అన్ని అనుమతులు ఉన్నట్లే అంటున్న ఓ ప్రజాప్రతినిధి

ఆ గ్రామం దేశాన్ని ఆకర్షించింది ఎన్నో అవార్డులు సొంతం చేసుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో శభాష్ అనిపించుకొంది. దేశ,విదేశాలకు చెందిన ఎందరో ప్రముఖులు ఆ గ్రామాన్ని సందర్శించి ప్రశంసలు అందజేశారు. అలాంటి గ్రామంలో సైతం ప్రస్తుతం రియల్ వ్యాపారం కొనసాగుతున్నది. పైసా పైసా కూడబెట్టి నిలువ నీడ కోసం చూస్తున్న మధ్యతరగతి సామాన్య ప్రజలే టార్గెట్ గా ఈ రియల్ వెంచర్ వ్యాపారం కొనసాగుతుంది. వ్యాపారం చేసుకోవడాన్ని ఎవరు తప్పుపట్టరు కానీ ఆ వ్యాపారం సక్రమమా… అక్రమమా.. అనేదే ప్రశ్న వ్యాపారం ఏదైనా అన్ని అనుమతులతో, ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా నడిస్తే బాగుంటుంది కానీ ఆ నిబంధనలకు తిలోదాకాలిచ్చి నిర్వహిస్తే వ్యాపారులకు, కొనుగోలుదారులకు ఇబ్బందులే కలుగుతాయి.

ఆదర్శ గ్రామంలో... అనుమతి లేని వెంచర్లు- news10.app

ఆదర్శ గ్రామంలో ఇది కథ..

వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం గంగదేవిపల్లిలో అనుమతులులేని వెంచర్ వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. నగరం విస్తరిస్తున్న కొద్దీ వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న ఈ గ్రామం సమీపంలో,గ్రామంలో ఉన్న భూములకు మంచి గిరాకే ఉంది. దీనిని ఆసరాగా చేసుకుని కొంతమంది ఇక్కడ వెంచర్లకు శ్రీకారం చుట్టారు. ఇదంతా బాగానే ఉన్నా ఇక్కడ నిర్వహిస్తున్న ఏ ఒక్క వెంచరుకు ఉండాల్సిన అనుమతులు ఏవి లేనట్లుగా తెలిసింది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన నాలకన్వర్షన్, కుడా అనుమతులు ఈ వెంచర్లకు ఏ మాత్రం లేవు. ఈ అనుమతులు ఏవి లేకుండానే వెంచర్ నిర్వాహకులు ప్లాట్ల ను విక్రహిస్తున్నారు. కొనుగోలుదారులు సైతం ఈ విషయం తెలియక ప్లాట్లు కొనేస్తున్నారు. కేవలం వెంచర్లో ప్లాట్ల ను విక్రహించడమే టార్గెట్ గా పెట్టుకున్న వెంచర్ నిర్వాహకులు అనుమతులు మాత్రం తమకేం అవసరం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట.

ప్రజాప్రతినిధి సహకారం…?

గంగదేవిపల్లి లో అనుమతులు లేకుండా వెంచర్ నిర్వహించడంలో అదే గ్రామానికి చెందిన ప్రజాప్రతినిది సహకరిస్తున్నట్లు సమాచారం.వెంచర్ నిర్వాహకులవద్ద నుంచి గిఫ్ట్ గా ప్లాట్ స్వీకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.దింతో ఈ ప్రజాప్రతినిధి అనుమతులు అసలు అవసరం లేదు నేనే అనుమతి ఇచ్చినట్లు అని చెపుతున్నట్లు తెలిసింది.

అధికారులు కదలాలి..

ఆదర్శగ్రామం గంగదేవిపల్లిలో అక్రమ వెంచర్ల వ్యవహారంపై అధికారులు కదలాలని ప్రజలు కోరుతున్నారు.ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఈ వెంచర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.