ఆ చిట్ ఫండ్ కు “కనక” వర్షం

చిట్ ఫండ్ ల ద్వారా చీటీలు నడిపి ఖాతాదారులకు సకాలంలో డబ్బులు అందించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడవాల్సిన చిట్ ఫండ్ లు పక్కదారి పట్టాయి. జనం సొమ్ము ను వేరే వ్యాపారాల్లోకి బదలాయించి ఖాతాదారులను ముప్పు తిప్పలు పెడుతున్నాయి.ఇదే కోవలో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అలాగే ఇతర జిల్లాల్లో అధికంగ శాఖలు ఉన్నాయని చెప్పుకునే ఓ చిట్ ఫండ్ జనాలవద్దనుంచి అధికమొత్తంలో డిపాజిట్లు దండుకున్నట్లు తెలిసింది.నిబంధనలకు విరుద్ధంగా ఖాతాదారులనుంచి డిపాజిట్ లు సేకరించింది.ఈ అక్రమ భాగోతాన్ని మొన్నటివరకు నిరాటంకంగా కొనసాగించిన ఈ చిట్ ఫండ్ కు కాసుల కనక వర్షమే కురిసిందట. నడిపేది చిట్ ఫండ్ ఐన చిట్ ఫండ్ పేరిట డిపాజిట్ లు తీసుకోకుండా ఎదో నిర్మాణ సంస్థ పేరుతో డబ్బులు తీసుకొని డెబిట్ నోట్ పేరిట డబ్బులు డిపాజిట్ చేసిన వారికి బాండ్ లు జారీ చేశారు.

ఆ చిట్ ఫండ్ కు "కనక" వర్షం- news10.app

దండుకుంది వెయ్యి కోట్లు…?

నిబంధనలకు విరుద్ధంగా ఓ నిర్మాణ సంస్థ పేరుతో డబ్బులు సేకరించి బాండ్ లు ఇచ్చిన ఈ చిట్ ఫండ్ యాజమాన్యం ఇప్పటివరకు డిపాజిట్ ల పేరుతో సుమారు వెయ్యి కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.ఇన్ని డబ్బులు చిట్ ఫండ్ పేరుచెప్పి వేరే నిర్మాణ సంస్థ పేరిట బాండ్ లు జారీచేసిన ఈ యాజమాన్యం డిపాజిట్ చేసిన ఖాతాదారులకు వారి సొమ్మును ఎప్పుడు అందిస్తుందనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.చిట్ ఖాతాదారుల సొమ్ము చెల్లింపు విషయంలోనే అందరి దృష్టి ఉండగా ఈ డిపాజిట్ మొత్తాల చెల్లింపు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియకుండా ఉంది. ఇప్పటికే ఈ చిట్ యాజమాన్యం పై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండగా ఖాజీపేట పోలీస్ స్టేషన్లో వీరిపై కేసు కూడా నమోదు ఐయింది .

ప్రజాదర్బార్ లో డిపాజిట్ దారులు….

కాగా ఇటీవల ప్రజాసేన అవినీతి నిరోధక స్వచ్చంద సంస్థ నిర్వహించిన ప్రజాదర్బార్ లో చిట్ ఫండ్ ఖాతాదారులు ఫిర్యాదులు చేశారు.ఈ ప్రజాదర్బార్ కు వెళ్లిన న్యూస్10 కు కనకదుర్గ చిట్ ఫండ్ లో డిపాజిట్ చేసిన కొంతమంది డిపాజిట్ దారులు తమ బాండ్ పేపర్లను చూపించారు.లక్షల్లో ఇక్కడ డిపాజిట్ చేసిన వీరికి ఆ యాజమాన్యం కనక దుర్గ కన్స్ట్రాక్షన్స్ పేరిట బాండ్ లు జారీచేసింది.కానీ ఇప్పటికీ వీరికి పైసా చెల్లించలేదు.దింతో డిపాజిట్ దారులు లబోదిబో మంటున్నారు… డిపాజిట్ రూపములో లక్షల్లో సమర్పించిన వీరు తమ డబ్బుల కోసం చిట్ ఫండ్ చుట్టూ తిరుగుతున్నారు.

ఒకే చోట అన్ని…

చిట్ ఫండ్ ,రియల్ వ్యాపారం,ఇలా అన్ని కార్యాలయాలు ఒకే చిట్ ఫండ్ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తూ ఖాతాదారులను ఆ చిట్ ఫండ్ గందరగోళానికి గురి చేస్తుంది.చీటి ముగిసినతర్వాత డబ్బులు ఇవ్వకుండా తాము నిర్వహిస్తున్న వెంచర్ లో అధిక ధరకు ప్లాట్లు కట్టబెడుతూ రియల్ వ్యాపారం చేస్తున్నారు. అలాగే అధిక వడ్డీ ఆశ చూపి చిట్ డబ్బులను డిపాజిట్ అంటూ మాయ చేసి వేరే సంస్థ పేరుతో బాండ్ లు ఇస్తూ జనాన్ని ఈజీగా మోసం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తూన్నాయి. ఇలా అదిక మొత్తంలో డబ్బులు డిపాజిట్ ల రూపంలో వసూలు చేసి డిపాజిట్ దారులు డబ్బులు అడిగితే రేపు మాపు అంటూ తిప్పుకుంటున్న చిట్ ఫండ్ యాజమాన్యం ఒకవేళ చేతులు ఎత్తేస్తే ఎలా…అని డిపాజిట్ దారులు ఆందోళన చెందుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో డిపాజిట్ ల రూపంలో డబ్బులు వసూలు చేసిన ఆ చిట్ ఫండ్ పై పోలీసులు ఇంకా ఎం కేసులు నమోదు చేస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here