బియ్యం దందా రూటు మారింది…?

గత కొన్ని యేండ్ల తరబడి అక్రమార్జన కు పాల్పడుతున్న బియ్యం మిల్లు వ్యాపారులు న్యూస్ 10 పత్రికలో ప్రజా పంపిణి బియ్యం వార్తలు ప్రచురించిగానే మిల్లర్లు తర్జన బర్జన అవుతున్నట్టు తెలిసింది. ప్రజా పంపిణి బియ్యం అక్రమ వ్యాపారంతో లక్షల్లో అర్జిస్తున్న వ్యాపారులు ప్రస్తుతం ఆటోల్లో కాకుండా ద్విచక్ర వాహనాల పై రవాణా చేస్తు కొత్త వ్యాపారానికి తెర లేపారు. ఎవరు చూసిన రైతులు ఎదో యూరియా, కిరాణా వ్యాపారస్తుడు సామాను తీసుకెళ్లుతున్నట్టు కనపడే విధంగా పక్కా ప్రణాళిక చేసుకొని అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు.

బియ్యం దందా రూటు మారింది...?- news10.app

అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికి అడపా దడపా కేసులు నమోదు చేసినప్పటికి వ్యాపారం మాత్రం ఆపే ప్రసక్తే లేదన్నట్టు వ్యవహరిస్తున్నట్టు ఉన్నారు…. మిల్లు యజమానులు ఇలా రోజంతా ఒక 10 మార్లు క్వింటా చొప్పున వాహనం పై వేసుకుని రవాణా చేస్తున్నట్లు తెలిసింది. ఇలా ఒక పది వాహనాల్లో సరఫరా చేస్తే అది ఒక లోడ్ అవుతున్నట్టు ఈ విదంగా అధికారుల కళ్లుగప్పి వ్యాపారం సజావుగా సాగిస్తూ… అక్రమ సంపాదన కోసం కొత్త పుంతలు తొక్కుతున్నారు. కాగా మిల్లు వ్యాపారుల పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోక పోవటం పై సర్వత్రా విమర్శలు వెళువెత్తుతున్నాయి… ఇదంతా ఒకెత్తయితే ఈ అక్రమ బియ్యం వ్యాపారం వెనక పెద్ద తలకాయలు ఉన్నట్టు ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ తతంగం వెనక ఎవరు ఉన్నారు …? ఈ వ్యాపారానికి ఊతం ఇస్తుంది ఎవరో పూర్తి వివరాలు ప్రజలకు అధికారులకు అందివ్వటానికి వివరాలు సేకరించే పనిలో ఉంది న్యూస్ 10 నిఘా టీం.