ఎస్ ఆర్ ఎస్ పి కాలువ… ఈ స్టోన్ క్రషర్ సొంతమా….?

మాధవ స్టోన్ క్రషరుకు రహదారే లేదు.
ఎసారెస్పీ కాలువ రహదారి పై నుంచే భారీ వాహనాల ప్రయాణం
కాలువ కుంగిపోతే నష్టం ఎవరికి…?
సంవత్సరాల తరబడి ఆ స్టోన్ క్రషరకు ఇదే దారి ఐనా పట్టింపులేని నీటిపారుదల శాఖ అధికారులు.
కొత్తగా వచ్చా…పాతవారిని అడిగి పరిశీలిస్తా అంటున్న డిఇ

అది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి రైతుల పంట పొలాలకు నీళ్లు అందించే ఎసారెస్పీ కాలువ. దీని ద్వారా వివిధ గ్రామాలకు నీటి సరఫరా అవుతుంటాయి. ఇదంతా బాగానే ఉన్నా ఇదే రహదారిని ఉపయోగించుకొని దామెరా మండలం ల్యాదేళ్ల గ్రామంలో ఓ స్టోన్ క్రషర్ యజమాని తన ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్నాడు. అడిగే వారు లేక తన స్టోన్ క్రషర్ ప్లాంట్ కు ఎలాంటి దారి లేకున్నా ఎస్సారెస్పీ కాలువ రహదారినే ఉపయోగిస్తూ తనకు అడ్డు ఎవరు లేరంటూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ తతంగం నడిపిస్తున్నాడు.ఎస్ ఆర్ ఎస్ పి కాలువ... ఈ స్టోన్ క్రషర్ సొంతమా....?- news10.app ఇదీ.. కథ…

దామెర మండలం ల్యాదేళ్ల గ్రామ శివారులో మాధవ స్టోన్ క్రషర్ పేరుతో క్రషర్ ప్లాంటును ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేయడం బాగానే ఉన్నా వీరు ప్లాంట్ పెట్టిన చోట వీరికసలు దారిలేదు. ప్లాంట్ పక్కనే ఎస్సారెస్పీ కాలువ ఉంది ఇంకేముంది.. కాలువకు చెందిన రహదారి పై నుంచే టిప్పర్లు, ట్రాక్టర్ల రవాణా కొనసాగుతుంది. నిజానికి ఎస్సారెస్పీ కి చెందిన కాలువల పక్కన ఉన్న రహదారులపైనుంచి ప్రైవేట్ వ్యక్తులకు చెందిన వాహనాలు ప్రయాణించకూడదు, యిది నేరం అయినా అడిగే వారు లేక సంవత్సరాల తరబడి నుంచి స్టోన్ క్రషర్ ప్లాంట్ యాజమాన్యం వాహనాలను నడుపుతూనే ఉంది. భారీ వాహనాలు క్రషర్ డస్ట్ తో కాలువ రహదారిపై నుంచి ప్రయాణం చేస్తే వాహనాల బారి లోడ్ మూలంగా కాలువ కుంగి పోతే నష్టం ఎవరికో నీటి పారుదల అధికారులే చెప్పాలి. మరోవైపు ఇన్ని సంవత్సరాలుగా మాధవ స్టోన్ క్రషర్ ఎస్సారెస్పీ కాలువ రహదారిని యథేచ్ఛగా వాడుతున్న నీటిపారుదల శాఖ అధికారులు తమకేం పట్టనట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కాని విషయం.

నాకేం తెలియదు.. డి ఇ

మాధవ స్టోన్ క్రషర్ ఎస్సారెస్పీ కాలువ రహదారిని వాడుతున్న విషయం తనకు తెలియదని, ఎస్సారెస్పీ డి ఇ వెంకటరమణ న్యూస్10 వివరణ కోరగా తెలిపారు. గతంలో పనిచేసినా డి ఇ ని తెలుసుకొని పరిశీలిస్తానని అన్నారు.