వెతల నౌకరీ….. హోమ్ గార్డ్ కు భద్రత ఏదీ…?

పోలీసు శాఖలో కష్టాల బ్రతుకీడుస్తున్న హోమ్ గార్డులు
కరోన వేళా తిరికలేదు, కనీస భద్రత కరువు
అకాల మరణం సంభవిస్తే ఆదుకునే వారు లేరు కుటుంబాలు రోడ్డున పడాల్సిందే
కరోనాతో మరణించిన డబిల్ పుర పోలీస్ స్టేషన్ హోమ్ గార్డును ఆదుకునే వారే లేరు.

వెతల నౌకరీ..... హోమ్ గార్డ్ కు భద్రత ఏదీ...?- news10.app

తమ జీతాల్లోంచి తాము కోత విధించుకొని చనిపోయిన కుటుంబాలను ఆదుకుందామన్న అదీ నిలిపివేసిన అధికారులు. పోలీస్ శాఖలో అందరితో కలివిడిగా మెదులుతు ఏ పనిలో ఐన తమకంటు ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని చాలి చాలని సౌకర్యాలతో బతుకీడుస్తున్న హోమ్ గార్డ్ లకు మరిన్ని వెతలు తొడయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు విషయంలో కాసింత కరుణించి న సౌకర్యాల విషయంలో మాత్రం వీరు ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారు. కరోన నేపథ్యంలో అన్ని శాఖలు బయపడిపోయి ముందుజాగ్రత్తలు పాటిస్తున్న నిత్యం రహదారులపై, పోలీస్ స్టేషన్లల్లో విధులు నిర్వహించే హోమ్ గార్డు లకు భద్రత లేకుండా పోయిందనే ఆరోపణలు వినవస్తున్నాయి. విధులు నిర్వహించే హోమ్ గార్డులకు కనీసం మాస్కులు కూడా సరఫరా కావడం లేదని ప్రస్తుతం వారిలో చర్చ జోరుగానే కొనసాగుతుంది. ట్రాఫిక్ ఇతర జనరల్ విధుల్లో కానిస్టేబుళ్లతో పాటు హోమ్ గార్డ్ లు కూడా విధులు నిర్వర్తిస్తుంటారు. పోలీసు అధికారులకు వీరు ఎప్పుడు అందుబాటులో ఉంటూ తమ విధులు నిర్వహిస్తుంటారు అలాంటి హోమ్ గార్డ్ ల విషయంలో వారికి కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో పోలిసుశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హోమ్ గార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య భద్రత విషయంలో హోమ్ గార్డ్ లకు ఇప్పటివరకు ఎలాంటి సౌకర్యాలను పోలీస్ శాఖ కల్పించలేదు. అనారోగ్యం బారిన పడితే సొంత ఖర్చులతో వైద్యం చేయించుకోవాలి. రీ ఎంబర్స్ మెంట్ అమలవుతున్న ముందుగా ఖర్చు పెడితేనే దిక్కు ఖర్చుపెట్టినదాంట్లో ఎంతో కొంత శాతం కొన్ని నెలల తర్వాత తిరిగి వస్తాయి దింతో అనారోగ్యం పాలయితే హోమ్ గార్డ్ కుటుంబాలు వైద్యం చేయించుకునే స్తోమత లేక …దీర్ఘకాలిక రోగుల్లా మారిపోతున్నారు. ఆరోగ్య భద్రత సౌకర్యాన్ని హోమ్ గార్డ్ లకు కల్పించే విషయంలో పోలీస్ శాఖ ఇప్పటికి ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడంతో హోమ్ గార్డులు ఆందోళన చెందుతున్నారు.

హోమ్ గార్డ్ కుటుంబం దయనియం

హైదరాబాద్ డబిల్ పుర పోలీస్ స్టేషన్లో హోంగార్డు గా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి ఇటీవల అనారోగ్యం పాలయ్యాడు. కుటుంబ సభ్యులు అతన్ని హైద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కరోన పాసిటివ్ గా తేల్చారు. వైద్యం చేయాలంటే రోజుకు లక్ష రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పారు. అంత డబ్బులు చెల్లించే స్తోమత లేని ఆ హోమ్ గార్డ్ కుటుంబం అతన్ని ప్రైవేట్ ఆసుపత్రి నుంచి ఉస్మానియకు తరలించారు అక్కడి డాక్టర్లు ఇక్కడ సాధ్యపడదని చెప్పడంతో గాంధీ ఆస్పత్రి కి తరలిస్తుండగా మార్గ మద్యంలోనే ఆ హోమ్ గార్డ్ కన్నుమూసాడు. కేవలం వైద్య సౌకర్యం లేక మొన్నటి వరకు విధులు నిర్వహించిన హోమ్ గార్డ్ కరోనాతో మరణించాడు అనేది స్పష్టం. అతని మరణం తర్వాత అతని కుటుంబాన్ని పోలీస్ శాఖ అధికారులు మందలించిన పాపాన పోలేది. ఏమాత్రం ఆర్థిక సాయం చేయలేదు. ప్రబుత్వం తరుపున అతని కుటుంబానికి ఇప్పటికీ ఏ సాయం అందలేదు. ఇటీవల ఐటి మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గంలో హోమ్ గార్డ్ మరణిస్తే మంత్రే స్వయంగా ఆకుటుంబానికి ఐదు లక్షల సాయం చేస్తూ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించారు కానీ ఈ విధానం రాష్ట్రం అంతటా అమలు చేస్తే బాగుంటుందని హోమ్ గార్డులు భావిస్తున్న అది ఇప్పట్లో ఆచరణ సాద్యం ఐఎలా కనిపించడం లేదు. ఇటు కోవిడ్ ను ఇతర కష్టాలను హోమ్ గార్డులు ఎదుర్కొని పనిచేస్తున్న భద్రత,సౌకర్యాల విషయంలో పోలీస్ శాఖ నిర్లక్ష్యం వహిస్తుండడం హోమ్ గార్డ్ లల్లో మరింత ఆందోళన రేకెత్తిస్తోంది.

సాయం చేయనీయరు…

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16వేల 5వందల మంది హోమ్ గార్డ్ లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఏ ఆపద వచ్చిన ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందటం లేదు కనుక వారే ఓ నిర్ణయానికి వచ్చి తమ ఒక్క రోజు వేతనం లో తమకు తాము కోత విధించుకొని ఆ మొత్తాన్ని బాధిత హోమ్ గార్డ్ కుటుంబానికి అందజేసేవారు. ఐయితే ఇటీవల కోత విధించిన మొత్తంలో అవకతవకలు జరిగాయని ఇటీవల ఈ మొత్తాన్ని అందించేందుకు పోలీసు అధికారులు ఒప్పుకోవడం లేదట దింతో తమ జీతాలను తాము స్వయంగా కోత విధించుకోకుండా మారిందని హోమ్ గార్డులు అంటున్నారు. డబ్బుల విషయంలో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా, తాము జీతాలను కోత విధించుకొని బాధిత హోమ్ గార్డ్ కుటుంబాలకు అందించే దానిని నిలుపుదల చేయడం అన్యాయం అంటున్నారు.మరి ఇప్పటికైనా పోలీస్ పెద్ద సార్లు స్పందించి హోమ్ గార్డులకు భద్రత,సౌకర్యాలు కల్పిస్తారో లేదో చూడాలి.