మరియపురం వెంచర్ కథేంది….?

ఓ మండలంలోని గ్రామంలో కుడా అనుమతులు లేకుండా దర్జాగా వెంచర్ చేసిన చర్యలు మాత్రం శూన్యంగానే కనిపిస్తున్నాయి… నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ వేస్తే చర్యలు తీసుకోవాల్సిన కుడా అధికారులు తమకెంతమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు…ఓ మున్సిపల్ ఉద్యోగి ఉపసర్పంచ్ కలిసి చేస్తున్న ఈ వెంచర్ దందాకు కొంతమంది అధికారులనుంచి సహకారం బాగానే అందుతున్నట్లు తెలుస్తుంది…

మరియపురం వెంచర్ కథేంది....?- news10.app

కుడా అధికారులు ఏంచేస్తున్నట్లు….?

కుడా పరిధిలో ఇటీవలి కాలంలో అనేక అక్రమ వెంచర్ లు వెలుస్తున్నాయి. కుడా ఆదాయానికి గండికొడుతూ ఇటీవలే హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తి రెవెన్యూ శివారులోని మరియపురం వద్ద ప్రభుత్వ నిబంధనలు భేఖాతారు చేస్తూ ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా వెంచర్ చేసి కుడా ఆదాయానికి గండి కొడుతుంటే అడ్డుకోవాల్సిన కుడా అధికారులు తమకేంపట్టనట్లు వ్యవహరించడం పట్ల అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా కుడా అధికారులు ఆ అక్రమ వెంచర్ పై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు

ఔట్ సోర్సింగ్ ఎలక్ట్రిషన్,ఉపసర్పంచ్ వెంచర్ దందా…..?

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ లో ఔట్ సోర్సింగ్ ఎలక్ట్రిషన్ గా విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి ఐనవోలు మండలంలోని ఓ గ్రామానికి ఉపసర్పంచ్ గా ఉన్న ఓ వ్యక్తి కలిసి ఈ అక్రమ వెంచర్ కు శ్రీకారం చుట్టినట్లు సమాచారం .ఎలాంటి అనుమతులు తీసుకోకుండా 1.25 గుంటల్లో అక్రమంగా 30 ప్లాట్లు చేసి అమాయక ప్రజలకు అమ్ముతున్నట్లు తెలిసింది.ఓ భాధ్యతాయుతమైన ఉపసర్పంచ్ పదవిలో ఉండి అనుమతులు లేని ప్లాట్లను ప్రజలకు అమ్మడం పట్ల చుట్టుపక్కల ప్రజలు ఆ ఉపసర్పంచ్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు

ముడుపులకు తలొగ్గారా?

హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం సింగారం శివారు మరియపురం లో “కుడా” అనుమతులు తీసుకోకుండా సర్వే నెం 637/2/2 లోని 1.25 గుంటల్లో దర్జాగా 30 ప్లాట్లు చేసి అమ్ముతున్న కుడా అధికారులు మాత్రం ఆ వెంచర్ పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సమాచారం. ఆ అక్రమ వెంచర్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మూలంగా ఆ వెంచర్ నిర్వాహకులు ఇచ్చే ముడుపుల వల్లే కుడా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ప్రచారం జోరుగా సాగుతోంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here