జూలై 31 వరకు వర్క్ ఫ్రమ్ హోమే…కేంద్ర మంత్రి

జూలై 31 వరకు దేశంలోని అన్ని ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ను పాటించాల్సిందే నని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు. మంగళవారం వివిధ రాష్ట్రాల ఐటీ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ను జూలై 31 వరకు పొడిగిస్తూనామని చెప్పారు.కరోనా నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడించారు. అన్ని ఐటీ కంపెనీలు దీన్ని పాటించాలని అన్నారు.