హన్మకొండ జిల్లాలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకుడు కాకున్నా తాను నాయకుడినంటూ…తన సతీమణి మిల్లర్ ఐయితే తాను మిల్లర్ అయినట్లు పోజులు కొట్టే ఓ మిల్లర్ కాని బకాయి మిల్లర్ ఓ కొత్త ప్రచారానికి తెర తీసినట్లు తెలుస్తుంది…మిల్లర్లను మచ్చిక చేసుకోవడం కోసం,వసూళ్ల దందా నడిపించడం కోసం న్యూస్10 పత్రికపై అవాకులు చవాకులు పేలుతున్నట్లు న్యూస్10 దృష్టికి వచ్చింది… హన్మకొండ జిల్లా పౌర సరఫరాల శాఖ లో జరుగుతున్న అవినీతి ఓ అధికారి,ఓ ఉన్నతాధికారి,ఓ ఇద్దరు మిల్లర్లు,ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అవినీతిని బయట పెట్టిన న్యూస్10 ను తాము సెట్ చేసినట్లు ఆ మిల్లర్ కాని బకాయి మిల్లర్ తెగ ప్రచారం చేస్తున్నట్లు తెలిసింది…వీరి అవినీతి భాగోతం గూర్చి నిత్యం పత్రికలో వార్తలు రావడమే వీరికి ఇష్టం గా ఉన్నట్లు కనపడుతుంది…న్యూస్10 వార్త కథనాలతో హన్మకొండ జిల్లా సివిల్ సప్లయీస్ లో కదలికలు రాగ ఆరోపణలు ఎదుర్కొన్న డి ఎస్ ఓ మొదలుకొని ఇతర ఉద్యోగులు సైతం బదిలీ ఐయ్యారు…దీనిని జీర్ణించుకోలేని ఆ మిల్లర్ కాని మిల్లర్ ఆ ఉన్నతాధికారితో కలిసి తప్పుడు ప్రచారానికి తెర తీస్తూ తాము న్యూస్10 ను సెట్ చేశాం అంటూ ప్రగల్బాలు పలుకుతున్నట్లు తెలుస్తుంది…అసోసియేషన్ నాయకుడిని అని చెప్పుకొనే ఆ మిల్లర్ కాని మిల్లర్ కొందరు మిల్లర్లతో “న్యూస్10 ను సెట్ చేశాం..”అంటూ పనికిమాలిన మాటలు చెపుతున్నట్లు సమాచారం…ఇటీవల జిల్లా పౌర సరఫరాల శాఖ లో జరుగుతున్న అవినీతి పై వరుస కథనాలు వస్తున్న నేపథ్యంలో మేము సెట్ చేస్తాం అంటూ మరో అసోసియేషన్ నాయకుడితో కలిసి ఈ మిల్లర్ కాని మిల్లర్ వసూళ్లకు విఫలయత్నం చేసినట్లు తెలిసింది…మిల్లర్లు ఎవరు ఈ ఇద్దరి మాట నమ్మక పోవడంతో వీరు తోక ముడిచినట్లు తెలిసింది…అలా తోక ముడిచిన వీరు ప్రస్తుతం ఉన్నతాధికారి తో కలిసి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నట్లు తెలిసింది…జిల్లా వ్యాప్తంగా మిల్లర్లు సి ఎం ఆర్ పెట్టాల్సిన గడువు పెరగగా ,ఆ సమయం కూడ దగ్గర పడుతుండటంతో ఉన్నతాధికారి,ఆ మిల్లర్ కాని మిల్లర్ అప్పడే ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది…అందులో భాగంగానే న్యూస్10 ను సెట్ చేశాం అంటూ బకాయి మిల్లర్ లకు ధైర్యం కలిపించి దండుకునేందుకు సిద్ధం ఐయినట్లు మిల్లర్లలో గుసగుసలు వినిపిస్తున్నాయి…. న్యూస్10 ను సెట్ చేయడం వంటి మాటలు ఇకనైనా ఆ మిల్లర్ కాని మిల్లర్, ఆ ఉన్నతాధికారి మానుకుంటే మంచింది…అనవసర ప్రచారాలు చేయడం వల్ల న్యూస్10 కు ఎం కాదు అంతేకాదు న్యూస్10 ఎప్పుడు ప్రజల తరపున వకాల్తా పుచ్చుకుంటుంది…ఎంతటి వారైనా అవినీతి చేస్తే వార్త రూపంలో ప్రజాక్షేత్రంలో పెట్టి వారి అవినీతిని బట్టబయలు చేస్తుంది…ఇది వారు గుర్తుంచుకోవాలి….మిల్లర్ కాని మిల్లర్ మాటలను వల్లెవేస్తున్న ఆ ఉన్నతాధికారి తన తీరును ఏమాత్రం మార్చుకోకపోగా న్యూస్10 పై ఎక్కడలేని అక్కసు తో పనికిమాలిన ప్రచారాలు చేయడం ఎందుకో…?ఆ ఉన్నతాధికారి విజ్ఞతకే వదిలేస్తున్నాం…తనకు మంత్రి అండ ఉంది..మంత్రి బావమరిది తాను అసోసియేషన్ నాయకులం అంటూ ఎగిరెగిరి పడుతున్న ఆ మిల్లర్ కాని మిల్లర్ అవినీతి పురాణం…భారీ బకాయిల చిట్టా త్వరలోనే బయటపడనుంది… ఆ మిల్లర్ కాని మిల్లర్ కు సహకరిస్తున్న అధికారుల భాగోతం సైతం బయటపడుతుంది…అలాగే వరంగల్ జిల్లాలో పౌరసరఫరాల శాఖలో అధికారుల తీరు…మిల్లర్ల బకాయి వ్యవహారాలపై న్యూస్10 త్వరలోనే కథనాలు వెలువరించనుంది…



