ప్రభుత్వం మెడలు వంచి రైతుల పక్షాన పోరాటం చేస్తాం.
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి.
జాతీయ రహదారిపై బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర,బిఆర్ఎస్ నేతలు.
గంటపాటు నిలిచిపోయిన వాహనాలు.
న్యూస్10: శాయంపేట
రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయకపోతే ప్రభుత్వం మెడలు వంచి రైతుల పక్షాన పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మండలంలోని మాందారిపేట జాతీయ రహదారి పై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున బైఠాయించి రైతులకు యూరియా కొరత లేకుండా చేయాలని నిరసన వ్యక్తం చేశారు. సుమారు గంటపాటు చేపట్టిన నిరసనతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లను అనతి కాలంలోనే నిర్మించి భారత దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ పై వేసిన సిబిఐ విచారణను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతులు యూరియా దొరకక అవస్థలు పడుతున్నారన్నారు.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు ఎంతోమంది రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, పంట పొలాలు నీట మునిగిపోయి తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రత్యేక శాసనసభలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు, బాధల గురించి చర్చించి వాటికి ఏమైనా పరిష్కారం ఇస్తారేమోనని సీఎం రేవంత్ రెడ్డి పై రాష్ట్ర ప్రజలు ఆధారపడితే ఆగం చేశారని అన్నారు. తెలంగాణ జీవనధార రైతులకు సంజీవనిలాంటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతులకు నీళ్ళు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని వరి పండించే రాష్ట్రాల్లో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిపిన ఘనత కెసిఆర్ కే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం కొరకు ఉద్యమాలకు శ్రీకారం చుట్టి తన పదవులను పక్కకు పెట్టి తెలంగాణ కొరకు పోరాటం చేసి తెలంగాణ సాధించారని అన్నారు. పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించి రైతులకు కరెంట్, యూరియా కష్టాలు రాకుండా రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చి, రైతుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు.రైతు సంక్షేమం కొరకు పాటుపడిన రైతు నాయకుడు కేసీఆర్ పై కుట్రపూరిత చర్యలకు పూనుకోవడం సిగ్గుచేటన్నారు. అధికారం లోకి రాగానే కేసీఆర్ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మొన్న శాసనసభ సమావేశం పెట్టి జస్టిస్ ఘోష్ కమీషన్ వేసి ఒక్క చెత్త కమీషన్ ఇచ్చిన ఏకపక్షం అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని ముందుకు పోతుంటే అది చాలదన్నట్టు సిబిఐ విచారణ చేయాలని చెప్పడం దుర్మార్గమన్నారు.
బిజెపి జేబు సంస్థలకు కేసీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టు ను ఇవ్వడం అంటే రేవంత్ రెడ్డి,మోడీ ఇద్దరు కలిసి కేసీఆర్ ఇమేజ్ తగ్గేలా చేయడం దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నామని అన్నారు.
రైతులకు యూరియా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు.రేవంత్ రెడ్డి కేసీఆర్ కి బేషరతుగా క్షమాపణ చెప్పి సిబిఐ విచారణ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.అనంతరం మండల కేంద్రంలోని యూరియా సరఫరా కేంద్రాలను పరిశీలించారు.మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డితో ఫర్టిలైజర్ షాప్ ఎదుట లైన్ లో ఉన్న మహిళా రైతులు కన్నీళ్లు పెట్టుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో పడుతున్న బాధలను,గోడును వెళ్లబోసుకున్నారు. చిన్న సన్న కారు రైతులు పడుతున్న బాధలను అధికారులు ప్రభుత్వం పట్టించుకోవడంలేదని కన్నీరు మున్నీరయ్యారు.మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మండల వ్యవసాయ శాఖ అధికారితో ఫోన్ లో మాట్లాడి ఏ గ్రామంలోని రైతులకు అదే గ్రామంలో ఒక్క పద్ధతి ప్రకారంగా టోకెన్ లు పిచ్చి యూరియా సరఫరా చేయాలని,రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని హెచ్చరించారు..ఈ కార్యక్రమంలో శాయంపేట మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ధైనంపల్లి సుమన్,మాజీ ఎంపీటీసీ గడిపే విజయ్, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గాజె రాజేందర్,మండల యూత్ అధ్యక్షులు మారేపల్లి మోహన్, టిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల విజయ్,కొమ్ముల సంతోష్, గ్రామ పార్టీ అధ్యక్షులు రేనుకుంట్ల సుమన్,పసుల ప్రవీణ్ కుమార్,ధైనంపల్లి సుమన్, సోషల్ మీడియా ఇంచార్జ్ దాసి శ్రావణ్ కుమార్, గంగుల మనోహర్ రెడ్డి మెతుకు తిరుపతిరెడ్డితో అన్ని గ్రామాల అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.



