అడ్డగోలు హాస్టళ్ళు

గ్రేటర్ వరంగల్ త్రినగరి లో కొన్ని ప్రయివేట్ హాస్టళ్లు తమ ఇష్టారాజ్యాంగ వ్యవహారిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి… నగరం లో రోజురోజుకు పుట్టగొడుగుల్ల పుట్టుకొ స్తున్న ఈ హాస్టళ్ళు ఇందులో ఉంటున్న వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో సైతం విఫలం అవుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.. అద్దెకు గదులు దొరికేతే చాలు కొంతమంది హాస్టల్ అని ఓ బోర్డు పెట్టి దందా నడుపుతునట్లు తెలుస్తుంది… హాస్టల్ లో ఉంటున్న వారు ఎం చేస్తున్నారు…? ఎలా ఉంటున్నారు…? అనే కనీస పర్యవేక్షణ లేకుండా తమకు నెల నెల డబ్బులు కడితే చాలు అన్నట్లుగా కొన్ని హాస్టల్ యాజమాన్యాలు వ్యవహారిస్తున్నట్లు తెలిసింది… భోజనం విషయంలో సైతం ఎలాంటి శ్రద్ధ తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు అందిస్తుండడం తో హాస్టల్ లో ఉంటున్న విద్యార్థులు అనారోగ్యం బారిన పడిన సందర్భాలు లేకపోలేదు.. తాజాగా హన్మకొండ భీమారం లోని శశాంక్ హాస్టల్ భోజనం లో బల్లి పడడం ఇందుకు ప్రత్యక్ష్య ఉదాహరణ…హాస్టల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి… అలాగే ఈ హాస్టల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా గతంలో గంజాయి విషయంలో హాస్టల్ లో ఉంటున్న కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది… ఇలా ఈ ఒక్క హాస్టలే కాకుండా మరికొన్ని హస్టళ్లు ఇలాగే వ్యవహారిస్తున్నట్లు తెలుస్తుంది… హాస్టల్ ఏర్పాటు చేయడం తప్ప అందులో ఉండే విద్యార్థుల బాగోగులు, భోజనం అందించడం లో నాణ్యత, సెక్యూరిటీ విషయంలో శ్రద్ధ ఏమాత్రం పెట్టడం లేదనే విమర్శలు బాగానే వినిపిస్తున్నాయి….

ఫంక్షన్ హల్ల నుంచి భోజనం…?

మిగిలిన భోజనం పట్టుకొచ్చి విద్యార్థులకు…?
ఆ హస్టల్ ఘనకార్యం అంతాఇంత కాదు..

మరో సంచికలో…

అడ్డగోలు హాస్టళ్ళు- news10.app

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here