మేడారం జాతరలో అధికారుల ఇష్టారాజ్యం పై విమర్శలు వస్తున్నా వారు మాత్రం వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు… వారికి తోచిందే తడవుగా అమలు చేసేస్తున్నారు… ఇతర అధికార యంత్రాంగం సైతం వారికి వంత పాడేస్తున్నట్లు కనపడుతోంది…భక్తుల మనోభావాలను ఏమాత్రం పట్టించుకోకుండా మేం అధికారులం మాకు అడ్డెవరు..? అన్నట్లు వ్యవహారిస్తున్నట్లు తీవ్ర విమర్శలు వస్తున్నాయి… మేము అధికారులు తమను ప్రశ్నించే దైర్యం ఎవరు చేయరు… ఎవరు ప్రశ్నించిన తమకు ఐయేది ఏమి లేదు అన్నట్లు మేడారం జాతరలో అధికార యంత్రాగం పనితనం కనపడుతుంది.. “యధ రాజా తధా ప్రజా “అన్నట్లు అధికారుల ప్రవర్తన, నిర్ణయాల తీరు ఇట్లా ఉంటే కింది స్థాయి అధికారులు, సిబ్బంది సైతం ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి…
అమ్మ గేటుకు అడ్డుగా కంచెలా…?
పోలీసు అధికారులు మేడారం జాతరలో తమ ఇష్టారాజ్యాంగ వ్యవహారిస్తున్నారు అనడానికి సాక్ష్యం ఇది… మేడారం జాతరలో ఎన్నడూ లేని విధంగా మేడారం ప్రధాన ద్వారాన్ని ఐరన్ భారీ కేడ్స్ తో పోలీసుల చేత మూసివేయించారు అధికారులు.. సమ్మక్క సారక్క మెయిన్ గేట్ ను అధికారులు బందించి వేశారు… ఈ విషయం ఇప్పుడు జాతరలో చర్చనీయాంశమవుతుంది…తల్లులకు భక్తులకు మధ్య అడ్డుగోడలా భారీ కేడ్స్ ఏర్పాటు చేసి దూరం నుంచి సైతం తల్లులు కనపడకుండా చేశారని భక్తులు ఆవేదన చెందుతున్నారు బందోబస్తు పేరా అధికార యంత్రాంగం వ్యవహారిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్న అధికారులు టేకిట్ ఈజీ అన్నట్లు వ్యవహారిస్తున్నారు… మరోవైపు ఆదిపరాశక్తిని అధికారంతో బంధించారని భక్తులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు…సామాన్యులకు అమ్మ తేజస్సును దూరం చేస్తున్నారని మండిపడుతున్నారు… ముళ్ల కంచెలు, అడ్డు గోడలు, భారీ కేడ్స్ అంటూ ప్రగతి భవన్ ముల్ల కంచె ముచ్చట చెప్పిన వారికి ఇది గుర్తుకు రాలేదా…? అని వారు ప్రశ్నిస్తున్నారు…అడ్డుగోడలు బద్దలు కొడతామని చెప్పి అమ్మకు కట్టారెందుకు…? అని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.. సమ్మక్క సారలమ్మలకు కంచెలు ఎందుకు ఏర్పాటు చేసినట్లు… ప్రధాన ద్వారాన్ని ఇనుప కంచెలతో ఎందుకు మూసి వేసినట్లో ఇక అధికారులే సమాధానం చెప్పాలి….








