అవును ఆ ఎమ్మెల్యే అంతే

“ఎమ్మెల్యే వీరంగం” శీర్షిక తో బుధవారం న్యూస్ 10 వె లువరించిన కథనం దుమ్ము రేపింది… ప్రజల తరపున వాకాల్తా పుచ్చుకొని నిజం నిర్భయంగా చెప్పే న్యూస్ 10 వెలువరించిన కథనం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది… ఎమ్మెల్యే తీరుపై ఆ నియోజకవర్గం లో చర్చ మొదలయింది.. ఎన్నికల్లో ఓటమి పాలైతే ఆ బద్నాం నాయకులపై వేసి దాడి చేయడం, బూతులు తిట్టడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు… ఎమ్మెల్యే తీ రును వారు తప్పు పడుతున్నారు…

బయటకు ఎలా పొక్కింది…?

గూడెప్పాడ్ లోని ఓ హోటల్ లో జరిగిన దాడి ఘటన బయటకు ఎలా పొక్కింది..? ఎవరి ద్వారా ఈ విషయం న్యూస్ 10 కు తెలిసింది… అంటూ సింగరేణి సిరులున్న నియోజకవర్గం ఎమ్మెల్యే ఆరా తీయడం మొదలుపెట్టాడట… తాను దాడి చేసిన నాయకున్నే పిలుపించుకొని నువ్వేమైనా మీడియా వాళ్లకు చెప్పావా అని ఆ ఎమ్మెల్యే ఆరా తీసినట్లు తెలిసింది… ఆ తర్వాత వెనువెంటనే తాను తిట్టినా,కొట్టిన నావద్దే పడి ఉండే వాడు విషయం బయటకు చెప్పడు కదా అని నిర్ధారణ కు వచ్చిన ఎమ్మెల్యే… ఆ నాయకు న్ని  విషయం ఎలా తెలిసింది…? అని అడగడం ఆపేసి న్యూస్ 10 పత్రిక గూర్చి ఆరా తీయడం మొదలు పెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది… ఇంతకీ న్యూస్ 10 పత్రిక ఎవరిదీ…? వారి బ్యాక్ గ్రౌండ్ ఏంటి…? ఎలా ఇరికిద్దాం అనే పనికిమాలిన ఆలోచనలకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టి అందుకు తగట్టు గానే వ్యూహరచన చేస్తూ… అసలే అధికార పార్టీ ఎమ్మెల్యే కనుక పోలీసుల వద్ద కూడా న్యూస్ 10 గూర్చి అడిగి అవసరమైన విషయాలు ఆరా తీయమని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది… వార్త కథనం విషయంలో రగిలి పోతున్న ఎమ్మెల్యే న్యూస్ 10 విషయంలో కోపంగా ఉన్నట్లు తెలిసింది…

ఆ ఎమ్మెల్యే అంతే…?

పలుమార్లు పోటీచేసి ఓటమి పాలయి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించి ఎమ్మెల్యే కాగానే తన ప్రవర్తనలో పూర్తి మార్పు వచ్చినట్లు నియోజకవర్గంలో టాక్ వినపడతుంది… కార్యకర్తలను ద్వితీయ శ్రేణి నాయకులను,సీనియర్లను సైతం లెక్కచేయకుండా ఇష్టారీతిన వ్యవహారిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి… గతంలో కూడ ఈ ఎమ్మెల్యే చిట్యాల మండలం లో ఓ గ్రామానికి చెందిన అప్పటి సర్పంచ్ పై ఇదే తరహా దాడి చేసి బూతులు తిట్టినట్లు తెలిసింది… అంతే కాదు జిల్లా కేంద్రం లో కలెక్టరేట్ లో పార్టీ కార్యకర్తపై చెయ్యి చేసుకున్నట్లు తెలిసింది…

తాను చెప్పిందే వేదం…

నియోజకవర్గం లో తాను చెప్పిందే వేదం అన్నట్లు వ్యవహరిస్తాడని ఆరోపణలు ఎదుర్కుంటున్న ఎమ్మెల్యే తన ఇష్టారాజ్యం గా ప్రవర్తిస్తు,నియోజకవర్గం లో ఏ అభివృద్ధి పనికి శిలాఫలకాలు వేసిన ఆ శిలాఫలకం పై తన ఫోటో వేసుకొని కొత్త సాంప్రదాయానికి తెర తీసినట్లు తెలుస్తుంది…మంత్రులు, సీనియర్ అధికారులు చివరకు సీఎం పేర్లు శిలాఫలకం పై ఉన్న కేవలం ఎమ్మెల్యే తన ఫోటో మాత్రం వేసుకొని దేఖో మై పరపతి అన్నట్లు వ్యవహారిస్తున్నట్లు తెలిసింది… నియోజకవర్గం మొత్తం శిలాఫలకాలు ఎమ్మెల్యే ఫోటో తో నిండిపోయినట్లు తెలుస్తుంది… ఇలా తన వ్యక్తిగత ఇమేజ్ కే పెద్ద పీట వేస్తు కార్యాకర్తలు, నాయకులపై సహనం కోల్పోయి దాడి చేస్తున్న సదరు ఎమ్మెల్యే పై అధిష్టానం ఎం చర్యలు తీసుకుంటుంది…? ఎమ్మెల్యే వీరంగం పై ఎలా స్పందిస్తుందో చూడాలి….

అవును ఆ ఎమ్మెల్యే అంతే- news10.app

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here