ఎమ్మెల్యే వీరంగం, అవును ఆ ఎమ్మెల్యే అంతే శీర్షికన న్యూస్ 10 వెలువరించిన కథనాలపై సడెన్ గా శాయంపేట కాంగ్రెస్ నాయకులు రియాక్ట్ అయ్యారు.. అది మా ఎమ్మెల్యే, మా నాయకుడే అంటూ క్లారిటి ఇస్తూ… ఈ వార్తలు వె లువరించిన న్యూస్ 10యాజమాన్యం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.. మండల కేంద్రం లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు… పనిలో పనిగా న్యూస్ 10 యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చారు… అధికారం లో ఉన్నారు ఏది చేసిన చెల్లుతుంది కనుక మండల కాంగ్రెస్ నాయకుడు దుబాసి కృష్ణమూర్తి ఓ అడుగు ముందుకువేసి న్యూస్ 10తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక చేసాడు… అంటే పరోక్షంగా దాడులు చేస్తాం అంటూ బెదిరింపులకు దిగాడన్నమాట… ఇక తాను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కనుక నిరాధార వార్త, ఆధారం బయటపెట్టు అంటూ మేధావి డిమాండ్ లు చేసిన బుచ్చిరెడ్డి న్యూస్ 10 అమ్ముడు పోయింది అంటూ పచ్చి అబద్దాలు, నిరాధార ఆరోపణలు చేసాడు… డబ్బులకు అమ్ముడు పోయారు అంటూ చీఫ్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఏ రాజకీయ ప్రమేయం లేకుండా.. బలిసిన పెట్టుబడి దారులు లేకుండా కొనసాగుతున్న న్యూస్ 10 కు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేశారు… మాజీ ఎమ్మెల్యే కు న్యూస్ 10 కు అసలు సంబంధమే లేకున్నా రాజకీయ ఆరోపణలు చేశారు… న్యూస్ 10 యాజమాన్యం ఎక్కడ రాజకీయ పార్టీలతో అంట కాగింది లేదు స్వతంత్ర జర్నలిజం తో ముందుకు వెళుతుంది… ఇలాంటి ఆరోపణలు సరికాదు అని ఖండిస్తుంది….




