ఆడ, మగ విత్తన మోసం…?

అధిక దిగుబడి వస్తుందని నమ్మించి విక్రయించిన “కావేరి 929” హైబ్రిడ్ వరి విత్తనాలు రైతుల జీవితాలతో ఆటలాడాయనే ఆరోపణలు హనుమకొండ జిల్లాలో కలకలం రేపుతున్నాయి. శాయంపేట, పరకాల మండలాల్లో సుమారు 40 ఎకరాల్లో సాగు చేసిన పంటలో “ఆడ విత్తనం ఓపెన్ కాక” గింజ పూర్తిగా రాకపోవడంతో రైతులు ట్రాక్టర్లతో పంటను తొలగించాల్సిన దుస్థితి ఏర్పడింది. లక్షల రూపాయల పెట్టుబడులు నీటిలో కలవడంతో బాధిత రైతులు కన్నీరుమున్నీరవుతుండగా.. వ్యవసాయ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చివరకు న్యాయం కోసం రైతులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పూర్తి వార్త కథనం న్యూస్10 సాయంత్రం సంచికలో….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here