అవును హన్మకొండ జిల్లా పౌరసరఫరాల శాఖలో ఆయన హస్తం అదృశ్యంగా ఉన్నట్లు తెలుస్తుంది… జిల్లా ఉన్నతాధికారిగా కొనసాగుతూ సివిల్ సప్లయీస్ విషయంలో తనకు ఒక్కోసారి అవసరం లేకున్నా ఆ శాఖకు సంబంధించిన అధికారులు ఉన్నా జోక్యం చేసుకొని గందరగోళం సృష్టిస్తాడని ఆ శాఖలో బాగానే ప్రచారం జరుగుతోంది… అసలే ఉన్నతాధికారి ఎక్కడ కాదంటే తమను టార్గెట్ చేస్తాడేమోనని కొందరు అధికారులు సైతం బయపడి ఆ ఉన్నతాధికారి చెప్పింది చెప్పినట్లు వింటూ విన్న దానికి తలలు ఊపుతున్నట్లు తెలుస్తుంది… ప్రధానంగా హన్మకొండ జిల్లా సివిల్ సప్లయీస్ లో తాను చెప్పిందే వేదం ల కొనసాగేలా ఆ శాఖలో అంతా సెట్ చేసి వివిధ రకాలుగా అక్రమ దారిలో అందినకాడికి అవినీతి ఆదాయాన్ని ఈ అధికారి బాగానే వెనకేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది…. గతంలో అనేక సార్లు ఈ ఉన్నతాధికారిపై అవినీతి ఆరోపణలు బాగానే వచ్చిన గత బి ఆర్ ఎస్ హయాంలో నల్గొండ జిల్లాకు చెందిన తన సామాజిక వర్గానికి చెందిన ఓ మాజీ మంత్రి తనకు దగ్గరి బంధువని చెప్పి తన అవినీతి దందా ను నిరాటంకంగా కొనసాగించినట్లు తెలిసింది…సూర్యాపేట లో విధులు నిర్వహిస్తున్నప్పుడు ఇలాంటి అవినీతి ఆరోపణలు రాగా బదిలీ పై ఆ ఉన్నతాధికారి హన్మకొండ కు వచ్చినట్లు సమాచారం…అంతేకాదు తనపై ఎవరైనా వార్త కథనాలు రాస్తే బెదిరించడానికి సైతం ఏమాత్రం వెనకాడని ఈ ఉన్నతాధికారి ఉమ్మడి జిల్లాలోని ఓ ప్రాంతంలో రెవెన్యూ డివిజన్ అధికారిగా పనిచేసినపుడు తనపై వార్త కథనాలు రాసినందుకు ఓ జర్నలిస్ట్ ను ముప్పుతిప్పలు పెట్టి ఏకంగా అతని ఉద్యోగానికి ఎసరు పెట్టి ఆ పత్రికలో లేకుండా తీసివేయించినట్లు న్యూస్10 పరిశీలనలో వెల్లడైంది…అధికారులు,ఉద్యోగులు జర్నలిస్టులు ఎవరితోనైనా కనీస మర్యాద లేకుండా మాట్లాడే ఈ ఉన్నతాధికారి దొర పోకడ పోతూ అందరిని తన ఇష్టారీతిలో దుర్బాష లాడడం చేస్తుంటాడు…వాడు వీడు అంటూ సంబోధిస్తు తన నోటికి పనిచెపుతాడు…తాను ఉన్నతాధికారిని కనుక తనను ఎవరూ ఎం చేయలేరని తాను టార్గెట్ చేస్తే ఎవరైనా ఖతం అవుతారని తనకు తానే ఎక్కువగా ఊహించుకొని కామెంట్లు చేస్తుంటాడని తెలిసింది….
మిల్లర్లతో మిలాఖత్…?
ఏది ఏమైనా కానీ,ఎన్ని విమర్శలు రాని తన ఉద్యోగ ధర్మానికి విరుద్ధమే కానీ అక్రమంగా ఆదనపు ఆదాయం సంపాదించడంలో ఆ ఉన్నతాధికారి ముందు వరుసలో ఉంటాడని తెలుస్తుంది…ఉన్నతాధికారి స్థాయిలో ఉండి ఓ ఇద్దరు మిల్లర్లతో ప్రధానంగా ఒక మిల్లర్ తో నిత్యం టచ్ లో ఉంటూ వారి ద్వార అన్ని మార్గాల్లో వచ్చే అక్రమ ఆదాయాన్ని పొందేందుకు జిల్లాలో బాద్యతలు చేపట్టిన నాటి నుంచి నానా రకాల వ్యూహాలు కొనసాగిస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి….మిల్లర్లకు ధ్యానం కేటాయింపు, సర్కారుకు బకాయి ఉన్న మిల్లర్లను కాపాడడం, డిపాలటర్ గా ఉన్న ధాన్యం కేటాయించడం ,అవసరమైతే ఆ మిల్లర్లకోసం కలెక్టర్ కు తప్పుడు సమాచారం ఇవ్వడం ఈ ఉన్నతాధికారి పనిగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది… ఇలా సారు అన్ని పనులు చేసి పెడుతున్నాడు కనుక ఓ భారీ బకాయి మిల్లర్ మిగతా మిల్లర్లను పోగు చేసి భారీఎత్తున సారును ప్రసన్నం చేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం…కలెక్టరేట్ లో పని ఉన్న లేకున్నా ఆ మిల్లర్ ను తన చాంబర్ కు పిలిపించుకుని నిత్యం సంప్రదింపులు జరుపుతూ విధులు నిర్వహించడం కన్నా అక్రమ దారిలో ఆదాయం సమకూర్చుకోవడం ఎలా అనే దానిపై ఆ ఉన్నతాధికారి దృష్టి సారించినట్లు తెలుస్తుంది…ఈ ఆదాయం సమకూర్చుకోవడంలో ఆ ఇద్దరు మిల్లర్లు సహకరిస్తున్నారు కనుక సివిల్ సప్లయీస్ లో వారికి ఏ పని ఉన్న వారికి చేసి పెట్టాలని కొందరు అధికారులపై ఆ ఉన్నతాధికారి ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలిసింది….
ఉన్నతాధికారిలో గుబులు…?
నిత్యం అవినీతి సంపాదనపైనే దృష్టి సారిస్తాడనే ఆ జిల్లా ఉన్నతాధికారి తాజాగా టాస్క్ ఫోర్స్,ఏసిబి, విజిలెన్స్ గుబులు పట్టుకున్నట్లు తెలుస్తుంది…బినామీ పేర్లతో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఇప్పటికే ఏసిబి దృష్టికి వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం…గతంలో తన కు చెందిన కొన్ని ఆస్తులు ఓ బినామీ పేరుపై ఉంచగా ఆ బినామీ సారు కు హ్యాండ్ ఇవ్వడంతో ఖంగు తిన్నట్లు తెలిసింది… ఇవన్ని నిఘా వర్గాల దృష్టిలో సైతం ఉన్నట్లు తెలియవచ్చింది….



