రెండు గుంటల ఎస్సై…? సివిల్ తగాదలో తల దూర్చిన రేగొండ ఎస్సై

సివిల్ తగాదా లో తల దూర్చవద్దని ఎన్నిసార్లు చెప్పినా, ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన, కోర్టులు స్పష్టంగా చెప్పిన,.. కొందరు పోలీస్ అధికారుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు… సివిల్ తగాదాల్లో తల దూర్చుతూ తమను ఏదోలా ప్రసన్నం చేసుకున్న వారికి లబ్ధి చేకూరేలా వ్యవహరించడం కొందరికి అలవాటుగా మారినట్లు విమర్శలు వినబడుతున్నాయి.. కొందరు పోలీసు అధికారులు భూమి సమస్య లపట్ల అత్యుత్సాహం చూపుతూ వాటిలో దూరి బాధితులని బెదిరిస్తూ తాము చెప్పిందే వినాలంటూ బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది.. తాజాగా ఓ రెండు గుంటల భూమి విషయంలో ఓ ఎస్ ఐ తనకు ఏ మాత్రం అవసరం లేకున్న తల దూర్చి బాధితుల పక్షాన కాకుండా భూమి కబ్జా చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి వైపే అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి… రెండు గుంటల భూమి విషయంలో ఆ ఎస్ ఐ ఓ దళిత కుటుంబాన్ని ముప్పు తిప్పలు పెడుతున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు… బాధితులు న్యూస్10 కు చెప్పిన వివరాల ప్రకారం …జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలం జగ్గయ్యపేట గ్రామం లో ఓ దళిత కుటుంబానికి అక్కడి కాలనీలో ఓ రెండు గుంటల ఖాళి స్థలం ఉంది… ఈ ఖాళి స్థలాన్ని అల్లూరి మహేందర్ 2007వ సంవత్సరంలో తన బంధువైన అల్లూరి సుమన్ వద్ద నుంచి కొనుగోలు చేశాడు… కొనుగోలు చేసే సమయంలో ఓ బాండ్ పేపర్ పై భూమిని కొనుగోలు చేస్తున్నట్లుగా రాయించుకుని మరి భూమిని కొనుగోలు చేశాడు.. కొనుగోలు చేసిన సంవత్సరం తర్వాత అల్లూరి మహేందర్2008 లో మృతి చెందాడు.. అతడు మృతి చెందిన తర్వాత అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆ ఖాళీ స్థలాన్ని తాము అల్లూరి మహేందర్ దగ్గర 2005లోనే కొనుగోలు చేశామని ఓ తెల్ల కాగితంపై రెవెన్యూ స్టాంపులు అంటించి కొనుగోలు చేసినట్లుగా రాయించి ఆ భూమి మాదేనంటూ అల్లూరి మహేందర్ కుమారుల తో గొడవకు దిగాడు.. కాగ అల్లూరి మహేందర్ ఆ ఖాళీ స్థలాన్ని 2007లో కొనుగోలు చేయగా, తాము 2005లోనే మహేందర్ దగ్గర కొనుగోలు చేశామని ,కబ్జా చేయాలని చూస్తున్నా వారు ఓ నకిలీ పేపర్ తయారు చేయడం అనుమానాలకు తావిస్తోంది… తమ తండ్రి 2007లో రెండు గుంటల స్థలాన్ని కొనుగోలు చేస్తే 2005లోనే ముందస్తుగా ఇతరులకు ఎలా అమ్ముతాడని వారు ప్రశ్నిస్తున్నారు.. అయితే ఇంతటి స్పష్టంగా తాము పేపర్లను కలిగి ఉన్న వారు నకిలీ పేపర్ ను సృష్టించారని తెలుస్తున్న రేగొండ ఎస్సై మాత్రం కబ్జా చేయాలని చూస్తున్న వారికే వత్తాసు పలుకుతున్నారని బాధితుడు అల్లూరి తిరుపతి ఆవేదన వ్యక్తం చేశాడు.. ఇదిలా ఉంటే ఖాళీ స్థలం వారిది కాకుండా ఎస్సై సహకారంతో తమదేనంటూ వాదిస్తున్న వాళ్ళు బయటి వ్యక్తులను తీసుకువచ్చి తమ స్థలంలో 50వేల రూపాయలు ఖర్చు చేసి వేసుకున్న షెడ్డును గ్రామస్తులందరూ చూస్తుండగానే కూల్చి నేలమట్టం చేశారని,.. ఆ వీడియో ఆధారంతో తాము రేగొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన రేగొండ ఎస్సై ఇప్పటికీ స్పందించలేదని, షెడ్డు కూల్చిన వారిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని బాధితులు చెప్పారు… షెడ్డు కూల్చిన వారిపై కేసు నమోదు చేయాలని తాము కోరితే రేగొండ ఎస్సై సందీప్ కుమార్ తమనే బెదిరిస్తున్నాడని ఎలాంటి ఆధారం లేని వారికి భూమి మీదే వెళ్లండి… అంటూ కబ్జా చేయాలని చూస్తున్న వారికే భరోసా ఇస్తున్నాడని,.. రెండు గుంటల భూమి విషయంలో అవసరం లేకున్నా అతి జోక్యం చేసుకొని ఎస్సై తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బాధితుడు ఆరోపించాడు …స్టేషన్ కు వెళితే కనీస మర్యాద లేకుండా మాట్లాడుతూ సమస్యను పరిష్కారం చేయకుండా ఇంకా జఠిలం చేయాలని చూస్తున్నాడని వారు అంటున్నారు.. కాగా రేగొండ ఎస్సై వ్యవహరిస్తున్న తీరుపై గ్రామంలో సర్వత్ర విమర్శలు వినవస్తున్నాయి.. రెండు గుంటల భూమి ఆ దళిత కుటుంబానిదే అయినా అదేమీ పట్టించుకోకుండా ఎస్సై తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు బాధితుడు తిరుపతి న్యూస్10 కు తెలిపాడు ..గ్రామానికి వచ్చి ఎస్సై భూమి మాది కాదంటూ వార్నింగ్ ఇస్తున్నాడని చెప్పాడు…కబ్జా చేయాలని చేస్తున్నవారు సృష్టించిన నకిలీ పేపర్ లో సంతకం కూడా తమ తండ్రి ది కాదని తిరుపతి స్పష్టం చేశాడు ..ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు కలగజేసుకొని తమ కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here