ఒకటే భవనం..రెండు ఆసుపత్రులు

త్రి నగరిలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి…భవనం అద్దెకు దొరికితే చాలు ఆసుపత్రి అంటూ ఓ బోర్డు పెట్టి వైద్య వ్యాపారం చేస్తున్నారు…ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పి ఆర్ ఓ లను నియమించుకుని,గ్రామాల్లో ఉన్న ఆర్ ఎం పి లతో ఒప్పందం చేసుకొని వైద్యం కోసం గ్రామీణ ప్రాంత ప్రజలు వచ్చేలా చేస్తున్నారు…ఇక వీరి వైద్యం,వీరు మోపుతున్న బిల్లుల మాట అటుంచితే ఆసుపత్రి ఏర్పాటు చేస్తే ఆ భవనంలో కనీస సౌకర్యాలు ఉండడం లేదు,సర్కార్ పెట్టిన నిబంధనల ప్రకారం కనీస జాగ్రత్తలు సైతం ఈ ఆసుపత్రుల యాజమాన్యాలు తీసుకోవడం లేదు.. దురదృష్టవశాత్తు ఈ భవనాల్లో ఏదైన ప్రమాదం జరిగితే భాద్యులు ఎవరనే దానికి కనీస సమాధానం కూడా దొరకడం లేదు…సరిగ్గా ఇదే కోవలో హన్మకొండ లోని విజయ టాకీస్ రోడ్ లో ఓ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు… ఏదైనా ఆసుపత్రి ఆ భవనం ఇరుకుగా ఉన్న సౌకర్యాలు లేకున్నా ఒకే ఆసుపత్రి ఉంటుంది కానీ ఈ భవనంలో ఒకటి కాదు రెండు ఆస్పత్రులను నిర్వహిస్తున్నారు….ఒకే భవనంలో పెర్టిలిటి సెంటర్,మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్వహిస్తున్నారు….సూర్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి,సూర్య పెర్టిలిటి సెంటర్ నడిపిస్తున్నారు…ఇదే భవనంలో రెండు ఆసుపత్రులకు చెందిన మెడికల్ షాపులను సైతం ఇక్కడే నిర్వహిస్తున్నారు…రోగులను తీసుకెళ్లేందుకు కనీస ర్యాంప్ లేకుండా…ఫైర్ సేఫ్టీ లేకుండా ఈ ఆసుపత్రులు కొనసాగుతున్నాయి… అలాగే అసలు ఈ ఆసుపత్రులకు వైద్య ఆరోగ్య శాఖ నుంచి అసలు అనుమతులు ఉన్నాయా..లేదా అనేది కూడా అనుమానంగానే ఉంది..వీటి అనుమతికి సంబంధించిన వివరాలు ఎక్కడ లభ్యం కావడం లేదు….ఈ విషయం పై హన్మకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎం సమాధానం చెప్తారో తెలియదు కాని అనుమతులు లేకుండా,ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న ఆస్పత్రులపై కనీస చర్యలు తీసుకోకుండా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిద్ర మత్తులో జోగుతున్నట్లు మాత్రం స్పష్టం అవుతుంది….కాగా ఈ ఆసుపత్రి నిర్వహణలో ఓ ప్రభుత్వ వైద్యుడు కీలకంగా వ్యవహరిస్తున్నాడు సర్కారీ నౌకరి ఉన్న ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఆ డాక్టర్ సాబ్ ఏకంగా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రినే నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది…మరి ఈ ఆసుపత్రి,ఆ ప్రభుత్వ వైద్యుడి పట్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి….

అధికారులు ఎందుకు గప్ చుప్…?

మరో సంచికలో….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here