హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లో ఓ ఉన్నతాధికారి పరిస్థితి “కంచే చేను మేసిన”… విదంగా మారింది…ఇతరుల విషయంలో ఆరోపణలు వచ్చిన, తనకు సంబంధం లేని శాఖలో అవినీతి వాసన వచ్చిన వెంటనే పసిగట్టి ఆఘమేఘాల మీద జిల్లా కలెక్టర్ కు సమాచారం ఇచ్చి వాటి విషయంలో సమగ్రంగా నివేదిక రూపొందించి ఫైల్ పెట్టె ఆ ఉన్నతాధికారి నూతన కలెక్టర్ వచ్చిన దగ్గర నుంచి ఏ ఒక్క ఫైల్ కలెక్టర్ కు పంపలేదని తెలిసింది..హన్మకొండ జిల్లా పౌర సరఫరాల శాఖలో ఓ ఇద్దరు మిల్లర్ల ఇష్టారాజ్యం,బకాయి మిల్లర్ బరితెగింపు,ఆ ఉన్నతాధికారి జోక్యంతో బకాయి మిల్లర్ కు పదే పదే ధాన్యం కేటాయింపు పై న్యూస్10 వరుస కథనాలు వెలువరించింది… ఈ కథనాలు ప్రారంభం కాగానే జిల్లా అదనపు కలెక్టర్ నెల రోజుల పాటు సెలవు పెట్టి వేరే దేశం వెళ్లారు….అదనపు కలెక్టర్ సెలవుతో ఇంచార్జ్ గా ఓ అధికారి ఉండగా సివిల్ సప్లయీస్ లో జరుగుతున్న అవినీతిపై అప్పటి కలెక్టర్ ప్రావీణ్య చర్యలకు దిగారు…బకాయి మిల్లర్ కు కేటాయించిన ధాన్యాన్ని వేరే మిల్లులకు కేటాయించారు…ధాన్యం తరలింపు సమయంలో హై డ్రామా నెలకొని ఓ అధికారి మిల్లర్ పక్షం వహించిన ఇది గమనించిన కలెక్టర్ ఆ అధికారిని అక్కడి విధుల్లోంచి తప్పించి స్థానిక తహశీల్దార్ ఇతర అధికారుల పర్యవేక్షణలో ఆ మిల్లు నుంచి ధాన్యం తరలించారు…అక్కడ నుంచి ఆ ధాన్యం తరలించడానికి ఒక్క రోజు పట్టిందంటే ఆ మిల్లర్ కు ఆ ఇద్దరు అధికారులు ఎంతలా సహకరించారో అర్థం అవుతుంది….ఇదంతా బాగానే ఉంది ఇలా చకచకా చక్కదిద్దే పరిణామాలు చోటుచేసుకుంటుండగా ఈలోపు కలెక్టర్ ప్రావీణ్య బదిలీ జరిగింది…వెంటనే స్నేహ శబరిష్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు… ఈలోపు సెలవుపై వెళ్లిన హన్మకొండ జిల్లా కలెక్టర్ సెలవు ముగించుకొని విధుల్లో చేరారు…వచ్చిరాగానే తనకు అత్యంత సన్నిహితుడైన బకాయి మిల్లర్ పై చర్యలు తీసుకోవడం ఆ ఉన్నతాధికారి కి నచ్చలేదు… అప్పటి కలెక్టర్ ప్రావీణ్య కు ఎదో చెప్పే ప్రయత్నం చేయగా కలెక్టర్ వినలేదు…బదిలీపై కలెక్టర్ వెల్లింది కనుక అదనపు కలెక్టర్ కొద్ది రోజులు సైలెంట్ మోడ్ లోకి వెళ్లారు…ఇక కొత్త కలెక్టర్ విధుల్లో చేరగానే మౌనం వీడి తనకు అన్ని రకాలుగా సహకరిస్తున్న ఆ ఇద్దరు మిల్లర్లకు సహకరించేందుకు వ్యూహం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది… ఆ మిల్లర్లకు ధాన్యం కేటాయింపు, బకాయి తదితర విషయాల్లో సాయం చేసేందుకు సివిల్ సప్లయీస్ లో పనిచేస్తున్న అధికారులకు హుకుం జారిచేసినట్లు తెలిసింది…ఆ ఇద్దరు మిల్లర్లు, ఆ ఉన్నతాధికారి ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలు కొత్త కలెక్టర్ దృష్టికి వెళ్లకుండా ఈ రోజు వరకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది…సివిల్ సప్లయీస్ విషయం లో ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం…. సివిల్ సప్లయీస్ లో అవినీతి విషయంలో అదనపు కలెక్టర్ పైనే ఆరోపణలు ,వార్త కథనాలు వస్తున్న నేపథ్యంలో కలెక్టర్ కు ఇప్పటికి పంపనట్లు తెలియవచ్చింది….బకాయి మిల్లర్ మిల్లు విషయంలో పి వి రిపోర్ట్ సైతం ఇప్పటివరకు కలెక్టర్ దృష్టికి వెళ్లకుండా చేసి గత పది రోజులుగా సివిల్ సప్లయీస్ పై ఎలాంటి ఫైల్ పంపకుండా అదనపు కలెక్టర్ సైలెంట్ గా ఉన్నట్లు కలెక్టరేట్ లో న్యూస్10 ప్రతినిధి ఆరాతీయగా తెలిసింది….తాను ఇవ్వాల్సిన రిపోర్ట్ కలెక్టర్ కు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆ ఉన్నతాధికారి తీరుపై కలెక్టరేట్ లో చర్చ జరుగుతుంది….
అధికారుల బదిలీకి అదనపు కలెక్టర్ యత్నం…?
సివిల్ సప్లయీస్ లో జరుగుతున్న అవినీతి,అదనపు కలెక్టర్ పై వస్తున్న ఆరోపణలపై న్యూస్10 కథనాలు వస్తుంటే తన తీరు మార్చుకొని, అవినీతికి అడ్డుకట్ట వేయాల్సిన అదనపు కలెక్టర్ అసలు సమాచారం న్యూస్10 కు ఎలా వెళుతుంది…?అనే దానిపై దృష్టి సారించారు…ఒక దశలో ఆ విషయం తెలుసుకునేందుకు తాను ప్రయివేట్ వ్యక్తులను నియమించానని అదేదో గొప్పగా లీకులు సైతం ఇచ్చాడు…అంతేకాదు న్యూస్10 కు వస్తున్న సమాచారం విషయంలో ఏమాత్రం సంబంధం లేని సివిల్ సప్లయీస్ అధికారులపై అనుమానంతో వారిపై కక్ష గట్టి ఎదో రకంగా వారిని ఇబ్బందులకు గురి చేయాలని దృఢ సంకల్పంతో అదనపు కలెక్టర్ ఉన్నట్లు తెలిసింది… తాను ఉన్నతాధికారి కనుక ,తాను ఏది చేసినా చెల్లుతుంది కనుక ఆ అధికారులను బదిలీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం… వారం రోజుల్లో వారికి బదిలీ బహుమానం అందించనున్నట్లు తెలిసింది….అదనపు కలెక్టర్ అనుసరించబోతున్న బదిలీ పనిష్మెంట్ అస్త్రం గూర్చి అతని పై అధికారుల కంటే ముందుగా బదిలీ చేస్తున్నాం అంటూ అదనపు కలెక్టరే ప్రచారం చేస్తున్నట్లు తెలియవచ్చింది..ఇదిలాఉంటే హన్మకొండ జిల్లా కలెక్టరేట్ విషయాలు అధికారులకంటే ముందుగా ఓ మిల్లర్ కు అదనపు కలెక్టర్ చేరవేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి…. దీన్నిబట్టి ఆ మిల్లర్ కు ఉన్నతాధికారి మధ్య ఎంతటి అవగాహన ఉందొ అర్థం అవుతుందని కలెక్టరేట్ లో కొందరు ఉద్యోగులు సెటైర్లు వేస్తున్నారు…సివిల్ సప్లయీస్ విషయంలో వస్తున్న ఆరోపణల విషయంలో కలెక్టర్ కు ఫైల్ పంపడానికి తీరిక లేని అదనపు కలెక్టర్ తన చాంబర్ లో ఓ మిల్లర్ తో గంటలు గంటలు ఎం చర్చిస్తున్నారో అర్థం కాని విషయం అదనపు కలెక్టర్ తన పనిలో బిజీగా ఉన్న గంటల తరబడి వేచిచూసి ఆ మిల్లర్ అదనపు కలెక్టర్ ను కలిసి ఎం చర్చిస్తున్నారో అసలు సివిల్ సప్లయీస్ లో ఎం జరుగుతుందో సమాధానం దొరకని భేతాల ప్రశ్నగా మిగిలింది…మరోవైపు ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు అదనపు కలెక్టర్ విషయంలో ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు…
బకాయి మిల్లర్ల భాగోతం….?
న్యూస్10 వరుస కథనాలు…
మరో సంచికలో



