టి ఏ గారి ఠీవి…?

ఖరీదైన కారు…కావాల్సినంత బంగారం …మిల్లర్లనుంచి కాసులు కురిసే అవకాశం..ఆ ఉన్నతాధికారి అత్యంత దగ్గర..ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఐయినా అందినకాడికి దండుకొని ఇప్పటికే కోటి క్లబ్ లో చేరిపోయాడని ఆ ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి పేరుంది….ఆ ఇద్దరు ఉన్నతాధికారులతో సమానంగా అవినీతి వాటాలు అందుకుంటున్న ఆ ఉద్యోగి హన్మకొండ జిల్లా సివిల్ సప్లయీస్ లో పనిచేస్తున్నాడు…ధాన్యం గోదాముల్లో బస్తాలు లెక్కించడం మొదలుకొని ,మిల్లులకు ధాన్యం కేటాయింపు వరకు ఇతగాడి జోక్యం లేనిది ఏ పని జరగదు..ఔట్ సోర్సింగ్ ఉద్యోగే ఐయిన ఇతగాడికి వాటా పంచకుండా ఆ ఇద్దరు అధికారులు ఉండరట… అంతేకాదు ఇతగాడి చేతికే రావాల్సిన ఆమ్యామ్యాలు వస్తే ఇతనే ఆ ధికారులకు పంచుతాడనే ఆరోపణలు సైతం బాగానే ఉన్నాయి…అంతెందుకు ఆ ఉన్నతాధికారి ఇంట్లోకి ఎలాంటి అడ్డు లేకుండా నేరుగా వెళ్లే చొరవ కూడా ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగికే ఉన్నట్లు కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి…హన్మకొండ పౌర సరఫరాల శాఖలో టెక్నీకల్ అసిస్టెంట్ గా ఔట్ సోర్సింగ్ కొలువు వెలగబెడుతున్న ఆ ఉద్యోగి అక్రమ లీలలు వింటే ఉన్నతాధికారులు సైతం నోర్లు వెళ్లబెట్టడం ఖాయమని టాక్…ఇంతకీ ఎవరా టి ఏ..ఏంటిదా అవినీతి భాగోతం… స్టిక్కర్ దందా నుంచి లారికి 12 వేల దాకా ఏంటీదా అవినీతి కథ…
న్యూస్ 10 విశ్వసనీయ వరుస కథనాలు…త్వరలో

వామ్మో టి ఏ…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here