నిబంధనలతో మాకేం పని అన్నట్లు
వ్యవహరిస్తోంది ఆ ఆసుపత్రుల యాజమాన్యాలు…ఒకే భవనంలో రెండు ఆసుపత్రులు నిర్వహిస్తూ మాకు సర్కార్ నిబంధనలతో ఏమాత్రం పనిలేదన్నట్లు ఆసుపత్రి నడిపిస్తున్నారు ఈ భవనంలో సూర్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సూర్య పర్టిలిటీ సెంటర్, ఇందిరా పర్టీలిటి సెంటర్ లతోపాటు మరో రెండు మెడికల్ షాపులను ఇదే భవనంలో కొనసాగిస్తున్నారు ..ఒకే భవనంలో నిబంధనలకు విరుద్ధంగా ఇలా ఆసుపత్రులు నిర్వహిస్తూ ప్రభుత్వ నిబంధనలతో మాకు అవసరం లేదన్నట్లు ఈ ఆసుపత్రి యాజమాన్యాలు తమ ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నాయి.. సర్కార్ వైద్యుడిగా కొనసాగుతున్న ఓ వైద్యుడి ఆధ్వర్యంలో ఇక్కడే ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నడుస్తోంది.. ఇతడి ఆధ్వర్యంలో ఈ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కొనసాగుతోంది ..అంతేకాదు ఇందులో సూర్య ఫెర్టిలిటీ ,ఇందిరా ఫెర్టిలిటీ పేరుతో ఫర్టిలిటీ సెంటర్లను నడుపుతున్న మరో పేరున్న వైద్యుడు తనకు చెందిన ఈ భవనంలో తాను ఆసుపత్రి నడుపుతూ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి సైతం అదే భవనాన్ని అద్దెకిచ్చినట్లు తెలుస్తోంది ..తాను పేరు ఉన్న వైద్యుడునని ఎవరు తనను ప్రశ్నించిన తన పరపతి గురించి గొప్పలు చెప్పుకుంటూ తనను ఎవరేం చేయలేరని ఆ వైద్యుడు ధీమా వ్యక్తం చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.. తాను వైద్యుల సంఘానికి ప్రాతినిధ్యం గతంలో వహించాను గనుక తాను ఏది చేస్తే అది చెల్లుతుందని తన పరిచయాలతో ప్రశ్నించే వారిని దబాయించే స్థాయికి ఆ వైద్యుడు వెళుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.. ఏమాత్రం నిబంధనలు పాటించకుండా ఆసుపత్రులను నిర్వహిస్తున్న ఈ ఇద్దరు వైద్యులు తమను తాము సమర్ధించుకునే స్థితిలో ఉన్నారు.. కాగా సూర్య పేరుతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, పర్టిలిటీ సెంటర్లు నిర్వహిస్తున్న ఈ భవనానికి కనీసం ఫైర్ సేఫ్టీ కూడా లేదు.. ఇలా ఫైర్ సేఫ్టీ లేని భవనంలో ఆసుపత్రి నిర్వహించడం ఏమాత్రం క్షేమకరమో ఆ వైద్యులకే తెలియాలి.. ఇలా ఫైర్ సేఫ్టీ లేని భవనంలో ఆసుపత్రి నిర్వహిస్తున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఎందుకు గమ్మున ఉంటున్నారో ..దాని వెనకాల ఉన్న మతలబు ఏంటో వారికే తెలియాలి… ఇదిలా ఉంటే ఈ భవనంలో పేరు ఉన్న వైద్యుడు నిర్వహిస్తున్న ఫెర్టిలిటీ సెంటర్లకు అనుమతులు లేనట్టుగా తెలుస్తోంది.. డే కేర్ పేరుతో తూతూ మంత్రంగా అనుమతులు తీసుకొని ఈ సెంటర్లను నిర్వహిస్తున్నట్లు సమాచారం.. డే కేర్ తో అనుమతులు ఉంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆసుపత్రిలో పేషంట్లను ఉంచి వైద్యం అందించి సాయంత్రం ఇంటికి పంపించాలి.. కానీ అలా చేయకుండా ఇన్ పేషెంట్లుగా చేర్చుకొని వారిని ఆసుపత్రిలోనే ఉంచి వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తోంది.. ఇలా కేవలం డేకేర్ అనుమతితో ఈ సెంటర్లను ఎలా నిర్వహిస్తున్నారో ఆ పేరున్న వైద్యుడుకే తెలియాలి… హనుమకొండ నగరం నడిబొడ్డున అనుమతులు ఉన్నాయో లేదో తెలియకుండా ఒకే భవనంలో వివిధ రకాల ఆస్పత్రులు ఫైర్ సేఫ్టీ లేకుండా ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో వారే సమాధానం చెప్పాల్సి ఉంది ..ఇకనైనా ఈ ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించి అనుమతులను పరిశీలించి చర్యలు తీసుకుంటారా..? లేక చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఫైర్ సేఫ్టీ లేని ఈ ఆసుపత్రిలో ఏదైనా సంఘటన జరిగితేనే అధికారులు కదులుతారా అనేది వారికే తెలియాలి…
30 పడకల ప్రయత్నం…ఐ సి యు?
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏంచేస్తున్నట్లు…? మరో సంచికలో....



