ఆయన అసలే పెద్ద సారు..ఆర్టిఏ లో ఎదురులేని సారు …తాను హన్మకొండ లో విధులు నిర్వహించిన,అక్కడ నుంచి కరీంనగర్ బదిలీ ఐయిన ఓ ఇద్దరు ఎజెంట్లను మాత్రం నమ్మకంగా తన వెంటే ఉంచుకొని వారి మకాం సైతం మార్పించి అక్రమ వసూళ్లు సాగిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సారు… మొన్నటివరకు హన్మకొండ ఆర్టిఏ కార్యాలయం వద్ద ఏజెంట్ గా పనిచేసి సారు బదిలీ కాగానే సారు వెంటే మేము అంటూ ఆ ఇద్దరు ఏజెంట్లు తట్ట బుట్టా సర్దుకున్నారంటే పెద్ద సారు రూపంలో ఉన్న ఆ డి టి సి ఏ సక్రమ కార్యం నెరవేరుస్తున్నారో అది సక్రమమో,అక్రమమో రవాణా శాఖ ఉన్నతాధికారులకు తెలియాలి….తనకేం తెలియదు అంటూ నిత్యం సుద్ద పూస మాటలు చెపుతూ ,ప్రశ్నిస్తే బెదిరిస్తాం అంటూ భారీ డైలాగులు కొట్టే ఆ అధికారి కనుసన్నల్లో కరీంనగర్ ఆర్టిఏ కార్యాలయంలో పైసలు ఇవ్వనిది అసలు ఫైలు ముందుకు కదలడం లేదు…పెద్ద సారు అండదండలు,ఇక్కడ పనిచేస్తున్న ఇతర అధికారుల ఆశీస్సులతో ఏజెంట్లు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు న్యూస్10 పరిశీలనలో వెల్లడైంది…పెద్ద సారు తో సహా ఇక్కడి అధికారులందరు ఎజెంట్లను మధ్యవర్తులుగా నియమించుకొని అక్రమ వసూళ్లు బాగానే చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి…ఇక్కడి ఏజెంట్లు తమ సార్ల కోసం బహిరంగంగానే వసూళ్లు చేస్తున్నారు…పనుల కోసం రేట్లు ఫిక్స్ చేసి డిజిటల్ రూపంలో వసూళ్లు కొనసాగిస్తున్నారు…కొందరు ఏజెంట్లు కాస్త బరితెగించి ఆర్టిఏ కార్యాలయం ఎదుటే వసూళ్లు చేస్తూ పట్టుకోండి చూద్దాం అంటూ సవాల్ విసిరినట్లు వ్యవహరిస్తున్నారు….ఇక కొందరు ఎజెంట్లయితే నేరుగా కార్యాలయం లోకి అప్లికేషన్స్ తో సహా ప్రవేశించి అధికారులతో మాట్లాడి నిమిషాల్లో పని చక్కబెట్టుకొని వస్తున్నారు….పెద్ద సారు ఎజెంటుగా ప్రచారం అవుతున్న ఓ ఏజెంట్ ఆర్టిఏ కార్యాలయంలో అధికారుల అన్ని చాంబర్లు సొంత ఇంటిలో తిరిగినట్లు తిరుగుతూ పనులు కానిచ్చేస్తున్నాడు….ఇక్కడి ఆర్టిఏ కార్యాలయంలో అంతా పెద్దసారు ఇష్టమే నడుస్తుంది కనుక ఆయన ఎజెంటు ను అని కొనసాగుతున్న ఏజెంట్ ఇష్టారాజ్యం కూడా ఇక్కడ బాగానే నడుస్తుంది….పెద్ద సారు తో సహా ఇక్కడ అధికారులు ఏర్పాటు చేసుకున్న ఏజెంట్లు అందరూ కలిసి రోజుకు లక్షల్లో వసూళ్లు చేస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి…అంతా నేను చూసుకుంట…అని పెద్ద సారు అభయం ఇవ్వడం వల్ల ఎలాంటి భయం లేకుండా ఇక్కడ ఏజెంట్లు వసూళ్లకు బరితెగించినట్లు తెలిసింది…
హన్మకొండ టు కరీంనగర్….
హన్మకొండ నుంచి కరీంనగర్ పెద్ద సారు బదిలీ కాగానే అక్కడ తనకు నమ్మకంగా పనిచేసిన ఓ ఇద్దరు ఎజెంట్లను ఆయన కరీంనగర్ కు పిలిపించుకున్నారు…వసూళ్ల కార్యం నమ్మకంగా చేసి పెట్టేందుకు ఆ ఇద్దరు పెద్దసారు పిలవగానే “సంతోషం”గా మకాం మార్చినట్లు తెలిసింది…ఆ ఇద్దరు స్థానికంగా సారుకు ఉన్న ఏజెంట్ తో ఎలాంటి మాట రాకుండా కలిసి పోయి పనిచేస్తున్నారట…ఆర్టిఏ కార్యాలయానికి దగ్గర్లో నివాసం ఏర్పరచుకొని ఈ ఇద్దరు స్వామి కార్యం స్వ కార్యాన్ని చక్కబెడుతున్నారట… రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పెద్దసారు తనకు నమ్మకమైన ఎజెంట్లను ఎక్కడకు బదిలీ అయితే అక్కడకు తీసుకు వెళ్తున్నాడు అంటే సారుది పెద్ద మనసే…. కాగా సారు తనకోసం తీసుకువెళ్లిన ఈ ఇద్దరు ఏజెంట్లు కార్యాలయం లో కనిపించకుండా కార్యాలయానికి అర కిలోమీటర్ దూరంలో అడ్డా ఏర్పాటు చేసుకొని సారు పైల్స్ పైన చుక్కల కార్యాన్ని చక్కబెడుతున్నారట….
కరీంనగర్ ఆర్టిఏ లో “పుష్ప”
న్యూస్10 విశ్వసనీయ కథనం
ఈరోజు సాయంత్రం సంచికలో…


ఆర్టిఏ కార్యాలయంలో స్వేచ్ఛగా తిరుగుతున్న ఏజెంట్



