గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ శివార్ల లోని రోడ్డు రవాణా సంస్థ కార్యాలయాల్లో టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించినట్లుగానే వరంగల్ నగరంలోని వరంగల్, హనుమకొండ ఆర్టిఏ కార్యాలయాల్లో టాస్క్ పోర్స్ ఆకస్మిక దాడులు నిర్వహించింది ఆర్టిఏ కార్యాలయాలకు చేరుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు కార్యాలయాల సమీపంలో నిర్వహిస్తున్న ఏజెంట్ల కార్యాలయాలపై తమ దృష్టిని సారించారు… అనంతరం ఆర్టిఏ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు …టాస్క్ ఫోర్స్ దారులతో అక్కడ ఉన్న ఏజెంట్లు అందరూ తమ కార్యాలయాలకు తాళాలు వేసి వెళ్లిపోయారు… ఏజెంట్లు వెళ్లిపోవడంతో ఆర్టీఏ కార్యాలయాలు బోసిపోయాయి.. టాస్క్ ఫోర్స్ దాడులతో ఆర్టిఏ కార్యాలయాల్లో ఏం జరుగుతుందో తెలియక వివిధ పనుల నిమిత్తం అక్కడికి వచ్చిన వాహనదారులు ఆందోళనకు గురయ్యారు.. కాగా హనుమకొండ వరంగల్ ఆర్టిఏ కార్యాలయాల్లో దాడులు నిర్వహించిన టాస్క్ ఫోర్స్ పలు ఏజెంట్లను తమ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.. వీరు నిర్వహిస్తున్న ఆర్థిక లావాదేవీలపై టాస్క్ ఫోర్స్ ఆరా తీసినట్లు సమాచారం.. టాస్క్ ఫోర్స్ దాడుల వల్ల వరంగల్ హనుమకొండ ఆర్టిఏ కార్యాలయాల వద్ద ఏజెంట్లు నిర్వహిస్తున్న కార్యాలయాలన్నీ మూతపడ్డాయి.. కొంతమంది ఏజెంట్లు తమ అందిన సమాచారంతో ముందుగానే కార్యాలయాలకు తాళాలు వేసి వెళ్ళిపోగా కొంతమంది ఏజెంట్లు రెడ్ హ్యాండెడ్ గా టాస్క్ ఫోర్స్ కు చిక్కినట్లు తెలిసింది… ఇది ఇలా ఉంటే హనుమకొండ ఆర్టిఏ కార్యాలయం పై టాస్క్ ఫోర్స్ దాడులు చేయగా కొంతమంది ఏజెంట్లు కార్యాలయాలకు తాళాలు వేసుకుని వెళ్లిపోగా అధికారులకు అనుకూలంగా ఉండే ఓ ఇద్దరు ఏజెంట్లు తమ అడ్డాను మార్చి టాస్క్ఫోర్స్ దాడులను సైతం లెక్కచేయకుండా రహస్యంగా తమ దందాను రోజువారి లాగే కొనసాగించినట్లు విశ్వసినీయంగా తెలిసింది ఈ ఇద్దరు ఏజెంట్లను టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంటే అధికారుల బండారం మొత్తం బయటపడే అవకాశం ఉందని హనుమకొండ ఆర్టిఏ కార్యాలయంలో ప్రచారం సాగుతోంది
ఏజెంట్లు సరే అధికారుల సంగతేంటి…?
ఏజెంట్లు మధ్యవర్తులుగా అధికారుల దందా..?
మరో సంచికలో….




