ఆ డి ఎస్ ఓ ఎందుకు వచ్చినట్టు…?

సూర్యాపేట జిల్లా డి ఎస్ ఓ మోహన్ బాబు హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కు గుట్టుచప్పుడు కాకుండా వచ్చి వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది…గత కొద్ది రోజుల క్రితం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కు వచ్చి ఎదో పని సర్దేసి వెళ్లడం వెనక బాగా అనుమానాలే ఉన్నాయి…కలెక్టరేట్ కు వచ్చి హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ ను కలిసి ఏఓ మంతనాలు జరిపి ఆతర్వాత అదనపు కలెక్టర్ ఛాంబర్ లోని సి సి పేషీలో కంప్యూటర్ లో పౌర సరఫరాల శాఖ అపీషియల్ వెబ్ సైట్ ఓపెన్ చేసి లాగిన్ అయి కొన్ని పేపర్లు ప్రింట్ అవుట్ తీసుకుపోవడం వెనకాల మర్మం ఏమిటో ఇప్పటికి ఎవరికి అర్థం కావడం లేదట..ఉన్నతాధికారులు సైతం సూర్యాపేట డి ఎస్ ఓ,హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ కు మధ్య ఉన్న లింక్ ఏంటో ఇప్పటికి ఆరా తీయలేదని తెలిసింది… పక్క జిల్లా అధికారి హన్మకొండ కలెక్టరేట్ కు సైలెంట్ గా వచ్చి ఎదో పని చక్కబెట్టి వెళ్లిన ఆపని ఏంటి…? అసలు సూర్యాపేట డి ఎస్ ఓ హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ ను ఎందుకు కలిసినట్లు…? అనే విషయం పై ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడం వల్ల తాను ఏం చేసిన ఉన్నతాధికారులు ఏమి అనరనే ధీమాలో అదనపు కలెక్టర్ ఉన్నట్లు తెలుస్తుంది…దీనికి తోడు తాను అంతా సెట్ చేశానని న్యూస్10 పత్రిక కథనాల విషయంలో వెనకడుగు వేస్తుందని ,ఇకపై వార్త కథనాలు రావని నగరానికి చెందిన ఓ తహసిల్దార్ అదనపు కలెక్టర్ కు ఓదార్పు మాటలు చెబుతూ మార్కులు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం… కాగ
గతంలో సూర్యాపేట జిల్లాలో జిల్లా పౌర సరఫరాల శాఖలో కోట్ల రూపాయల ధాన్యం స్కామ్ … ఓ మిల్లర్ జైలుకు వెళ్లిన వైనం… ఈ స్కామ్ జరిగిన సమయంలో అక్కడ అదనపు కలెక్టర్ గా ఇప్పటి హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ విధుల్లో కొనసాగారు…ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో అదనపు కలెక్టర్ అక్కడనుంచి హన్మకొండ జిల్లా కు బదిలీ అయ్యారు… అప్పుడు డి ఎస్ ఓ గా మోహన్ బాబు ఉన్నారు…అప్పుడు ఆ జిల్లా ట్రక్ షీట్ల విషయంలో ఏదో తకరారు ఉంటే వాటిని సెట్ చేసే విషయంలో సూర్యాపేట డి ఎస్ ఓ హన్మకొండ కలెక్టరేట్ కు వచ్చి అదనపు కలెక్టర్ ను కలిసినట్లు ఆరోపణలు వస్తున్నాయి…సూర్యపేట విషయం నుంచి బయట పడేందుకు ఈ ఇద్దరు అధికారులు విఫల యత్నం చేస్తున్నట్లు సమాచారం…ఇదిలాఉంటే సూర్యాపేట డి ఎస్ ఓ మోహన్ బాబు హన్మకొండ కలెక్టరేట్ కు వచ్చి ఏదో పని చక్కబెట్టినట్లు వస్తున్న ఆరోపణల విషయంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ కూపీ లాగితే అసలు విషయం బయటపడే అవకాశం ఉంది…జిల్లా కలెక్టర్ ఈ విషయంలో దృష్టి సారిస్తే అసలు అదనపు కలెక్టర్ ఏం చేస్తున్నాడనే విషయం నిజా నిజాలు బయట పడే అవకాశం ఉంది…ఈ విషయంలో జిల్లా కలెక్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here