ఆ రెండు డయాగ్నోస్టిక్స్ లకు నోటీసులు

ఎట్టకేలకు హన్మకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు.. ఏ ఈ ఆర్ బి ఎలొర అనుమతులు లేని విజేత డయాగ్నోస్టిక్స్ అండ్ స్కానింగ్,కనెక్ట్ డయాగ్నోస్టిక్స్ కు నోటీసులు జారీచేశారు… ఈనెల 30 న ఈ రెండు డయాగ్నోస్టిక్స్ లను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అళ్ళెం అప్పయ్య ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు… తనిఖీల అనంతరం వీటికి నోటీసులు జారీచేశారు …మూడు పని దినాల్లో డయాగ్నోస్టిక్స్ కు సంబంధించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు తెచ్చుకోకుంటే చర్యలు తప్పవని నోటీసుల్లో పేర్కొన్నారు…కాగా ఈ తనిఖీల్లో విచిత్రం ఎంటటే విజేత డయాగ్నోస్టిక్స్ 2017 నుంచి ఏ ఈ ఆర్ బి అనుమతి పత్రం తమకు సమర్పించలేదు అని పేర్కొంటూనే ప్రోక్యూర్ మెంట్ లేఖను చూసి అదే లైసెన్స్ సెప్టెంబర్ 26 న వచ్చింది అని పేర్కొంటూ ఆ లేఖ మాకెందుకు ఇవ్వలేదు అని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏ ఈ ఆర్ బి అనుమతి పత్రం విషయంలో తమ అవగాహన రాహిత్యాన్ని బయటపెట్టుకున్నారు…ఏ ఈ ఆర్ బి లైసెన్స్, ధరల పట్టిక తమకు సమర్పించాలని తమ దయాగుణాన్ని విజేత పట్ల అధికారులు చాటుకున్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here