కరీంనగర్ జిల్లా ఆర్టిఏ కార్యలయంలో అక్రమ.వసూళ్ల దందా ఆగేలా లేదు పెద్ద సారు జోక్యంతో ఆ వసూళ్ల దందా కాస్త.గుట్టుగా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది…వార్త పత్రికలో కథనాలు వస్తే వచ్చే అక్రమ రాబడి ని వదులుకుంటామా…?నా కోసం వచ్చిన ఏజెంట్లు ఏమై పోవాలి సర్కార్ వేతనం కంటే ఓ పది రేట్లకు పైగానే అక్రమ ఆదాయం సమకూరాలి అంటే దందా నడవాలి కదా అన్నట్లు ఆ పెద్దసారు ఇక కొద్దీ రోజులు బహిరంగం వద్దు గుట్టు గా వసూలు చేసి గోప్యంగా వాటా పంపండి అని అక్కడి ఏజంట్లకు అవినీతి హితోపదేశం చేసినట్లు సమాచారం…అంతేకాదు ఆర్టిఏ కార్యాలయంలో ఎవరు కొత్తగా కనిపించిన అనుమానించాలి …నజర్ వేయాలి అని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది… పనిలోపనిగా న్యూస్10 లో అక్రమ వసూళ్లపై కథనాలు వస్తున్నాయి కనుక న్యూస్10 కు కార్యాలయ సమాచారం ఎవరు ఇచ్చిన తోలు తీస్తానని గట్టిగానే ఉద్యోగులకు పెద్దసారు వార్నింగ్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం… ఏజెంట్లకు తాను పూర్తిగా సహకరిస్తానని అక్రమ వసూళ్ల జోరు ఇంకా పెంచాలని సదరు అధికారి భరోసా ఇచ్చినట్లు తెలియవచ్చింది… అసలే పెద్దసారు ఇచ్చింది ఎక్కడలేని భరోసా ఇంకేముంది ఏజెంట్లు,అక్కడి ఇతర అధికారులు రెట్టించిన ఉత్సాహం తో అక్రమ వసూల్లు ఎప్పటిలాగే గుట్టుగా చేస్తున్నట్లు సమాచారం…
నిద్రావస్థలో ఉన్నతాధికారులు….
కరినంగర్ ఆర్టిఏ లో అడ్డగోలుగా అక్రమ వసూళ్ల భాగోతం కొనసాగుతున్న అక్కడి పెద్దసారే వెనకాల ఉండి అక్రమ వసూళ్లు చేయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న రవాణా శాఖ ఉన్నతాధికారులు మాత్రం తమకేం పట్టనట్లే వ్యవహరిస్తున్నట్లు స్పష్టం అవుతోంది… వసూళ్ల భాగోతం అడ్డు అదుపు లేకుండా చేస్తున్న కనీసం ఇదేంటని అక్కడి అధికారిని ఉన్నతాధికారులు ప్రశ్నించే సాహసం చేయకపోవడం వెనకాల ఉన్న మతలబు ఏంటో అర్థం కావడం లేదు….నిద్రావస్థ నటిస్తున్న ఉన్నతాధికారులు చర్యలకు వెనకాడడం విమర్శలకు తావిస్తోంది… ఈ ఉన్నతాధికారుల వల్లే ఇలాంటి అధికారులు అక్రమ వసూళ్లు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు సైతం బలంగా వినిపిస్తున్నాయి…
పెద్ద సారు వ్యవహారం పై
ఏసీబీ నజర్ వేయాలి…!!
మరో సంచికలో…..



