హన్మకొండ లోని రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆ సీటు పైకి ఎవరు వచ్చిన అవినీతిని మాత్రం వీడడం లేదనే విమర్శలు వస్తున్నాయి…ప్రతిపనికి ఓ రేటు ఫిక్స్ చేసుకొని చేసే పని అక్రమం ఐయిన కానిచ్చేస్తున్నట్లు ఆరోపణలు బాగానే వినిపిస్తున్నాయి… మొన్నటివరకు ఈ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ గా పనిచేసిన ఓ అధికారి అవినీతి పనుల్లో ఆరితేరి బదిలీపై వెల్లగా ఆ ఆస్థానంలో వచ్చిన ప్రస్తుత సబ్ రిజిస్ట్రార్ సైతం అక్రమాలకు తెర తీసినట్లు తెలుస్తుంది… ఉన్నతాధికారులు మందలించిన ఆయన తీరులో మార్పు మాత్రం రాలేదని టాక్ …అంతేకాదు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలోని ఓ ఇద్దరు ఉన్నతాధికారులు నామమాత్రాంగా ఎదో మందలించినట్లు చేసి పరోక్షంగా సహకారం అందిస్తుండడం వల్ల ఈ సబ్ రిజిస్ట్రార్ తన అక్రమ రిజిస్ట్రేషన్ల పనిని వేగవంతం చేసినట్లు విశ్వసనీయ సమాచారం… కావాల్సింది అందితే చాలు వెనుకా ముందు చూడకుండా “ఆనందం”గా పని కానిచ్చేస్తున్నట్లు సమాచారం…నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా రిజిస్ట్రేషన్ పనులు చేసే ఈ సబ్ రిజిస్ట్రార్ ఇటీవల ఓ వెంచర్ నిర్వాహకుల కోసం నిబంధనలు పక్కనపెట్టి రిజిస్ట్రేషన్ పని పూర్తి చేసినట్లు సమాచారం..ఇలా వచ్చిన ఈ కొద్ది కాలంలోనే అక్రమ రిజిస్ట్రేషన్ చేసి బాగానే వెనుకేసుకున్నట్లు తెలిసింది…ఈ సబ్ రిజిస్ట్రార్ సార్ తాను రిజిస్ట్రేషన్లు చేయడానికి కొంతమంది మధ్యవర్తుల సాయంతో కావాల్సింది అందుకొని పని చేసి పెడుతున్నాడని కార్యాలయంలో చర్చ జరుగుతోంది… ఎవరికి అనుమానం రాకుండా ఈ మధ్యవర్తులే పనులు చేసిపెడుతున్నట్లు తెలియవచ్చింది…



