వంతపాడిన ఎంజీఎం అధికారులు

పేదల పెద్దాసుపత్రి ఎంజీఎం లో ఆ కాంట్రాక్టర్ కు అధికారులు బాగానే సహకారం అందిస్తున్నట్లు తెలుస్తుంది…అతగాడికి బిల్లులు మంజూరి చేయడానికి ఏది చెపితే దానికి ఎంజీఎం అధికారులు వంతపాడుతున్నట్లు తెలుస్తుంది….ఎంజీఎం లో కాంట్రాక్టర్ గా కొనసాగుతున్న అతడు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగుతుందని ఆసుపత్రిలో ఉన్న అందరికి తెలిసిన విషయమే…దీనికి మరింతగా మద్దతు తెలిపినట్లు ఎంజీఎం అధికారులు కాంట్రాక్టర్ కు ఏ పని ఉన్న చిటికెలో చేసి పెడుతున్నట్లు తెలిసింది…”ఊరికనే ఏది రాదు”అన్నట్లు ఇక్కడి అధికారులు కొందరు కాంట్రాక్టర్ తో మిలాఖత్ ఐయి చకచకా పనులు చేసి పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది…ప్రభుత్వ నిబంధనలు, కాంట్రాక్టర్ కుదుర్చుకున్న ఎం ఓ యూ కు విరుద్ధంగా బిల్లుల విషయంలో అడగగానే వీరు సిద్ధం చేసి పువ్వుల్లో పెట్టి మరీ ఆ కాంట్రాక్టర్ కు అప్పగిస్తున్నట్లు సమాచారం…అటెండెన్స్ మస్టర్ ,ఉద్యోగుల సంఖ్య,పనితీరు,సానిటేషన్ నిర్వహణ ఇవేవీ కనీసం ప్రాథమికంగానైన పరిశీలించకుండా…ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాకుండా కాంట్రాక్టర్ తన ఇష్టప్రకారం సుమారు వందమంది పైగా సిబ్బందిని తక్కువగా నియమించిన…ప్రభుత్వం పేర్కొన్న సిబ్బంది సంఖ్యకే బిల్లులు మంజూరి చేయడం సర్కార్ ఖజానాకు బొక్క పెట్టడం ఎంజీఎం అధికారులకే చెల్లిందని విమర్శలు వస్తున్నాయి…ఆ కాంట్రాక్టర్ ఇక్కడ కాంట్రాక్ట్ తీసుకుంది మొదలు అప్పటినుంచి 96 శాతం సాటిస్ఫ్యాక్టరీ అంటూ సర్టిపై చేస్తూ ఎంజీఎం అధికారులు బిల్లులు నిక్షేపంగా అందిస్తున్నారంటే ఏ మేరకు అధికారులను ఆ కాంట్రాక్టర్ ప్రసన్నం చేసుకున్నాడో అర్థం అవుతుందని ప్రస్తుతం ఎంజీఎం లో చర్చ జరుగుతోంది….అంతేకాదు రెండు సంవత్సరాలు గా కాంట్రాక్టర్ కు బిల్లులు మంజూరి చేస్తున్న ఎంజీఎం అధికారులు ఆ కాంట్రాక్టర్ పర్యవేక్షణలో పనిచేస్తున్న ఉద్యోగుల హాజరు మస్టర్లు ఇప్పటివరకు ఏ ఒక్క మస్టర్ పరిశీలించకుండా వాటిని భద్రపరచకుండా బిల్లులు గుడ్డిగా మంజూరి చేస్తూ కాంట్రాక్టర్ సేవలో వారు తరిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి….. సెక్షన్ క్లర్క్ నుంచి సూపరింటెండెంట్ స్థాయి అధికారి దాకా నిత్యం కాంట్రాక్టర్ అడగగానే బిల్లులు మంజూరి చేస్తూ సహకరిస్తున్నారు తప్ప ఒక్కసారి కాంట్రాక్టర్ పనితీరు విషయంలో అసలు పరిశీలన చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి….గత రెండు సంవత్సరాలు గా కోట్ల రూపాయల బిల్లులు కాంట్రాక్టర్ కు మంజూరి చేస్తున్న అధికారులు అటెండెన్స్ మస్టర్ లేకుండా ఎలా ఇస్తున్నారో వారే సమాధానం చెప్పాలి…ఎం ఓ యు నిబంధనలను తుంగలోతొక్కి గుట్టుచప్పుడు కాకుండా కాంట్రాక్టర్ కు బిల్లులు మంజూరు చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో వారికే తెలియాలి…ఎంజీఎం లో కాంట్రాక్టర్ కు అప్పనంగా కోట్ల రూపాయలు అప్పగిస్తున్న తీరుపై గత కొద్దిరోజుల క్రితం న్యూస్10 లో కథనం వెలువడగా విదేశం లో ఉన్న కాంట్రాక్టర్ హుటాహుటిన వచ్చి బిల్లుల కోసం విశ్వప్రయత్నాలు చేస్తుండగా అతగాడికి సహకరించేందుకు జీ హుజూర్ అంటూ ఎంజీఎం అధికారులు వంతపాడుతున్నట్లు సమాచారం…అటెండెన్స్ మస్టర్లు, ఇతర రికార్డులు, పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య ఇలా ఏమి చెప్పకుండా అప్పనంగా కోట్ల రూపాయలు ఎగరేసుకుపోవడానికి కాంట్రాక్టర్ సిద్ధం కాగా ఎవరి సొమ్మును ఎవరికి అప్పనంగా నిబంధనలకు విరుద్ధంగా అధికారులు ఎలా అప్పగిస్తారో వారికే తెలియాలి..కాంట్రాక్టర్ బిల్లుల విషయంలో ఉన్నతాధికారుల ఎలా స్పందిస్తారో చూడాలి….

విజిలెన్స్ దృష్టి సారిస్తుందా…?

ఎంజీఎం అధికారుల తీరుపై మరింత సమగ్ర కథనం…
న్యూస్10 సాయంత్రం సంచికలో….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here