అక్కడ తల నీలాలు మాయం అవుతున్నాయి…బహిరంగ మార్కెట్ లో వేల రూపాయలు విలువ చేసే తల నీలాలు అక్కడ ఉన్న కొందరి అధికారుల సాయంతో గుట్టుచప్పుడు కాకుండా తరలిపోతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి… అడ్డదారిన మాయం చేస్తున్న తల నీలాలతో కొందరు వ్యక్తులు లక్షల్లో స్వాహా చేస్తూ దండిగానే డబ్బులు వెనకేసినట్లు ఆరోపణలు జోరుగా వినవస్తున్నాయి…ఈ తలనీలాల దందా అడ్డదారిన కొనసాగుతూ మహిళలకు చెందిన విలువైన తలనీలాలు మాయం ఐయ్యేది ఎక్కడో కాదు పర్వతగిరి మండలం అన్నారం దర్గా లొనే…
అధికారుల సహకారం…?
అన్నారం దర్గాలో యాకుబ్ బాబకు సమర్పించే తల నీలాలు మాయం అవుతున్నట్లు తెలుస్తోంది…ప్రధానంగా ఈ దర్గాలో మహిళలు సమర్పించే తలనీలాలను కొందరు వ్యక్తులు దొంగచాటుగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు విమర్శలు వినవస్తున్నాయి…ఇలా దొంగ చాటుగా తల నీలాలు మాయం చేసి అమ్ముకోవడానికి దర్గాలో వక్ఫ్ బోర్డులో పనిచేస్తున్న సూపరింటెండెంట్, ఇన్స్పెక్టర్ వారికి తమ శాయశక్తులా సహకరిస్తున్నట్లు దర్గాలో ఆరోపణలు వినిపిస్తున్నాయి… లక్షలాది రూపాయలు విలువ చేసే తలనీలాలు మాయం చేసి కొందరు అమ్ముకునేలా ఈ ఇద్దరు అధికారులు ఓ నాయీబ్రాహ్మణుడితో కలిసి సహకరిస్తున్నట్లు అన్నారం దర్గా లో చర్చ జరుగుతోంది…. ఈ దర్గాలో వక్ఫ్ బోర్డ్ కు సంబంధించి దాదాపు 25 మంది సిబ్బంది ఉన్న నిఘా శూన్యం గానే ఉండగా తల నీలాలు మాయం అవుతుండడం ఇప్పుడు ఇక్కడ చర్చనీయాంశంగా మారింది….అన్నారం యాకుబ్ బాబా కు సమర్పిచిన మొక్కు తలనీలాలను మాయం చేస్తున్న ఘనులు వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్, సూపరింటెండెంట్ తో పాటు స్థానిక నాయీబ్రాహ్మణుడి తో కుమ్మక్కు ఐయ్యారని కొందరు ఆరోపిస్తున్నారు….కాగా ఈ అన్నారం దర్గాలో ప్రతి సంవత్సరం వేలం ద్వారా తల నీలాల పాట నిర్వహిస్తారు.పోయిన సంవత్సరం 2022-23)28, 00, 000/-ఇరవై ఎనమిది లక్షలకు పాట శ్రీనివాసరావు కు ఖరారు కాగ. 2023 నుండి ఎలాంటి టెండర్ నిర్వహించకుండా దర్గా ఇన్స్పెక్టర్, సూపరెంటెండెంట్, నాయీబ్రాహ్మణులకు చెందిన ఓ వ్యక్తి కుమ్మక్కు అయి మహిళల తల నీలాలు కాజేస్తూ, వక్ఫ్ బోర్డు కు ఆదాయ పరంగా గుండు గిస్తున్నట్లు తెలుస్తుంది…పోగుచేసిన తల వెంట్రుకలను అడిషనల్ కలెక్టర్ సమక్షం లొ వేలం ద్వారా అమ్మాల్సి ఉండగా ఒక వ్యక్తి తో ఇన్స్పెక్టర్ కుమ్ముక్కు అయి చాటు గా అతనికి ఇస్తున్నట్లు సమాచారం… గతం లొ తల నీలాలకు 28 లక్షలు రాగ సంవత్సరం గడుస్తున్న వక్ఫ్ బోర్డు లో ఇప్పటికి కనీసం 5 లక్షలు సైతం జమ చేయకపోవడం గమనార్హం. ఇప్పటికయినా తల నీలాల మాయం పై విచారణ జరిపి, సంబంధిత వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుచున్నారు…



