ఎంజీఎం ఆసుపత్రిలో ఓ కాంట్రాక్టర్ పై వస్తున్న అవినీతి ఆరోపణలపై న్యూస్10 వెబ్ సైట్ లో ఈరోజు ఓ కథనం రావడంతో కాంట్రాక్టర్ అనుచరుడు ఎంజీఎం లో అతగాడి వ్యవహారాలు చక్కబెట్టే ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి న్యూస్10 ప్రతినిధిపై ఏకంగా బెదిరింపులకు దిగాడు…వార్తలు రాస్తున్నావ్ నీ అంతు చూస్తా అంటూ ఎంజీఎం సూపరింటెండెంట్ కార్యాలయం ముందే ఉద్యోగులందరు చూస్తుండగా వార్నింగ్ ఇచ్చాడు…మా కాంట్రాక్టర్ దగ్గర పనుచేస్తున్న ఉద్యోగులందరి తో నీ పై దాడి చేయిస్తా అంటూ నోటికి వచ్చినట్లు దుర్బాషలాడాడు… ఎంజీఎం లో సెక్యూరిటీ,సానిటేషన్ ఇతర ఏ విషయంలోనైనా ఏ జర్నలిస్ట్ ప్రశ్నించిన వార్త కథనాలు రాసిన ఇతగాడే ఆ కాంట్రాక్టర్ తరుపున బెదిరింపులకు దిగుతాడు..ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ బెదిరించే ప్రయత్నం చేస్తాడు..ఈ క్రమంలోనే న్యూస్10 ప్రతినిధిపై బెదిరింపులకు పాల్పడుతూ నిన్ను లేకుండా చేస్తా అంటూ తీవ్రస్థాయిలో బెదిరించాడు…వార్తలు రాస్తే తన అనుచరుడితో బెదిరిస్తున్న సదరు కాంట్రాక్టర్,ఆ కాంట్రాక్టర్ కు సహకరిస్తున్న ఎంజీఎం అధికారులు ఈ విషయంలో ఎం సమాధానం చెవుతారు…న్యూస్10 ప్రతినిధికి ఎంజరిగిన దీనికి వారే బాధ్యత వహించాల్సిఉంటుందని స్ఫష్టం చేస్తున్నాం….



