ఎంజీఎం లో ఆ కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం కొనసాగుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి… తాను చెప్పినట్లుగానే ఎంజీఎం అధికారులు బిల్లుల మంజూరికి మాట మాత్రమైన అడగకుండా సంతకాలు పెట్టి ఆ కాంట్రాక్టర్ పనిని చాలా సునాయాసంగా పూర్తి చేస్తున్నట్లు ఆరోపణలు బాగానే వినపడుతున్నాయి…ఎంజీఎం లో కాంట్రాక్టర్ గా కొనసాగుతూ శానిటేషన్, సెక్యూరిటీ తదితర రంగాల్లో మ్యాన్ పవర్ సమకూర్చి సర్కార్ నుంచి డబ్బులు తీసుకుంటున్న ఇతగాడికి పెద్ద ఆస్పత్రిలోని అధికారులు తమ శాయశక్తుల సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది… కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించే విషయంలో ఎలాంటి తనిఖీలు లేకుండా మ్యాన్ పవర్ విషయం ఏ మాత్రం అడగకుండా కాంట్రాక్టర్ చెప్పిందే వేదంగా అధికారులు సంతకాలు చేసి బిల్లులు పాస్ చేసి కోటి రూపాయలకు పైగా మొత్తాన్ని పువ్వుల్లో పెట్టి అప్పగిస్తున్నట్లు సమాచారం ..ఎంజీఎం లో ఆ కాంట్రాక్టర్ కు అధికారులు సహకరిస్తూ ఆ కాంట్రాక్టర్ నిర్వహిస్తున్న ఏజెన్సీలో అసలు ఎంతమంది కార్మికులు ఉన్నారు…? ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంతమందిని ఆ కాంట్రాక్టర్ ఉద్యోగులుగా విధుల్లోకి తీసుకున్నాడు ..? అనే విషయాలు ఏమీ తెలియకుండానే అధికారులు అతడు చెప్పిన సంఖ్యనే రికార్డుల్లో నమోదు చేసుకుని ఆసంఖ్య ప్రకారమే బిల్లులు చెల్లిస్తున్నట్లు ఎంజీఎం లో చర్చ జరుగుతోంది . కనీసం ఇప్పటికీ ఎంజీఎం లో ఆ కాంట్రాక్టర్ నియమించిన ఉద్యోగుల సంఖ్య అధికారులకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు అంటున్నారు… శానిటేషన్ ఇతర విభాగాల్లో 600కు పైగా ఉద్యోగులను నియమించాల్సిన కాంట్రాక్టర్ కేవలం 500 పైగా ఉద్యోగులను మాత్రమే నియమించి ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇంతమందిని నియమించాలని చెప్పిన సంఖ్య ప్రకారమే డబ్బులు దండుకుంటున్నట్లు విశ్వసినీయ సమాచారం . అంతేకాదు ఈ ఉద్యోగుల హాజరు పట్టిని పరిశీలించకుండానే అటెండెన్స్ మస్టర్స్ తెప్పించుకోకుండానే, అవేమీ లేకుండానే అధికారులు వివిధ విభాగాల్లో మార్కులు బాగానే వేస్తూ 96% సంతృప్తికరమంటూ కాంట్రాక్టర్ కు సాటిస్ ఫ్యాక్టరీ సర్టిఫికెట్ ఇస్తూ బిల్లులు మంజూరు చేస్తున్నట్లు తెలుస్తోంది.. కాగా ఏ కాంట్రాక్టర్ పనులు నిర్వహించిన 96% సంతృప్తికరం ఎలా వస్తుందో..? ఎంజీఎం అధికారులకే తెలియాలని పలువురు అంటున్నారు… పదికి పది ఐదుకు ఐదు ఇలా సంతృప్తికరమంటూ గ్రేడింగ్ మార్కులు ఇస్తూ అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఆ కాంట్రాక్టర్ కు తమ శాయశక్తుల సహకరిస్తున్నట్లు తెలుస్తోంది.. కాగా ప్రతినెల ఆ కాంట్రాక్టర్ కు ఎంజీఎం లో ఆర్ ఎం ఓ మంజూరు చేస్తున్న బిల్లు ఎంత..? ఇది ఏ మార్గదర్శకాల ప్రకారం మంజూరు చేస్తున్నారో …? తెలియని స్థితి నెలకొన్నట్లు విమర్శలు వస్తున్నాయి.. ఎంజీఎం ఆర్ఎంఓ ఎం ఓ యు నిబంధన ప్రకారమే బిల్లులు ఇస్తున్నారా …? లేక తమ ఇష్టారీతిన మంజూరు చేస్తున్నారా..? వారే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది..కాగా గత రెండు సంవత్సరాలుగా ఆ కాంట్రాక్టర్ కు 96% సంతృప్తికరమంటూ సర్టిఫికెట్ ఇస్తూ బిల్లులు భారీగానే చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది ..ఉద్యోగుల నియామకానికి సర్కార్ చెల్లిస్తున్న బిల్లులకు ఏమాత్రం పొంతన లేకుండా కాంట్రాక్టర్ చెప్పినట్లే అధికారులు బిల్లులు మంజూరు చేయడం, అటెండెన్స్ మస్టర్స్, ఇతర రికార్డులు పరిశీలించకుండానే బిల్లులు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది ..ఇకనైనా ఈ విషయంలో అధికారులు ఆ కాంట్రాక్టర్ రికార్డులను పూర్తిగా పరిశీలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఎం ఓ యు మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకుంటారా..? లేక ఆ కాంట్రాక్టర్ చెప్పింది చెప్పినట్లు చేస్తూ కోట్ల రూపాయలు అప్పగిస్తారా? చూడాలి…



