ఎంజియం అధికారులు ససేమిరా…?

ఎంజీఎం పరిపాలన విభాగంలో పనిచేస్తున్న డుమ్మాల సీనియర్ ,జూనియర్ అసిస్టెంట్ల పై చర్యలు తీసుకోవడానికి ఎంజీఎం అధికారులకు మనసు రావడం లేదు…విధులకు ఎగనామం పెట్టిన, హాజరు పట్టిక లో ఖాళీ గడులు ఉంచి డుమ్మాలు కొట్టిన మరుసటి రోజు సంతకాలతో లెక్క సరిచేసిన వీరిపై చర్యలకు ఎంజీఎం అధికారులు ససేమిరా అంటునట్లే కనిపిస్తోంది…డుమ్మాల వ్యవహారం లో,హాజరు పట్టిక ఖాళీ గడుల విషయంలో అక్కడి ఏ డి ,ఆ ఇద్దరు సీనియర్ ,జూనియర్ లదే హస్తమని తెలిసిన ఎంజీఎం అధికారులు మాత్రం తమకేం అవసరం అన్నట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి…చూస్తాం ,చేస్తాం అంటూ కాలం వెళ్లదీస్తూ ఆ ఇద్దరు ఉద్యోగులపై చర్యలు తీసుకోవడానికి మీన మేషాలు లెక్కిస్తున్నారు…చర్యలు తీసుకోకుండా వారిని కాపాడడానికి ఎంజీఎం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి…

ఎమ్మెల్యే అండ….?

కాగా తాము ఎం చేసిన తమను అధికారులు ఎవరేం చేయలేరని జూనియర్ ,సీనియర్ ధీమా వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది గ్రేటర్ వరంగల్ కు చెందిన ఓ ఎమ్మెల్యే తో తమకు బాగానే సాన్నిహిత్యం ఉందని అందుకే అధికారులు తమపై చర్యలకు వెనుకాడుతున్నారని ప్రచారం చేసుకుంటున్నట్లు తెలిసింది అధికారులు తమపై చర్యలు తీసుకోవాలని చూసిన ఎమ్మెల్యే నుంచి ఫోన్ రావడంతో ఆగిపోతున్నారని వారు డంబాలు కొడుతూ సదరు ఎమ్మెల్యే ను సైతం బద్నాం చేస్తున్నట్లు సమాచారం…ఆ ఎమ్మెల్యే తో వీరికి ఏపాటి సంబంధాలు వీరికి ఉన్నాయో తెలియదు కాని జూనియర్,సీనియర్ అసిస్టెంట్లు మాత్రం వారికి ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది….ఒకవేళ నిజానికి ఎమ్మెల్యే వీరికి సహకరిస్తుంటే ఇలాంటి వారికి ఎందుకు సహకరిస్తున్నారో వారికే తెలియాలని పలువురు అంటున్నారు…


ఇప్పటికైనా కదులుతారా…?

ఎంజియం లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న జూనియర్,సీనియర్ అసిస్టెంట్ల పై అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా.. ? లేక వారికే వత్తాసు పలుకుతారా…?అనే సందేహాలు ఎంజీఎం లో వ్యక్తం అవుతున్నాయి…చర్యలు తీసుకోకుండా వారు ప్రసన్నం చేసుకుంటేనే వారికి సహకరిస్తున్నారా…?అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి…. మరి ఈ విషయంలో ఎంజీఎం అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here