సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్ టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేశారు….మాజీ ముఖ్యమంత్రి పై తన అసహనాన్ని ,ఆగ్రహాన్ని వెళ్లగక్కారు…అసలు సమాజంలో జీవించే హక్కు లేదని మొదటికే ఎసరు పెట్టినట్లు మాట్లాడారు…పనిలో పనిగా కేటిఆర్ ,హారిష్ రావు లను కూడా కలిపి ఇవే వ్యాఖ్యలు చేశారు…హరీష్ రావు,కేటిఆర్,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి లు గ్యామ్ బ్లర్లు అంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు…
పీసీసీ సమావేశంలో సీఎం రేవంత్ సంచలన తీర్మానం చేశారు..
సర్వేలో పాల్గొనకపోతే KCR, KTR, హరీష్‌రావులను సామాజిక బహిష్కరణ చేయాలని తీర్మానం చేస్తున్నానని అన్నారు…సర్వేలో పాల్గొనాలని KCR,KTR ఇంటిఎదుట డప్పుకొట్టాలని పిలుపునిచ్చారు…సర్వే లో పాల్గొనకపోతే సామాజిక బహిష్కరణ చేయాలని అన్నారు…అంతేకాదు ప్రధాని మోదీ కులం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు…
మోదీ కులంపై కీలక వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డి
మోదీ బీసీ కాదు.. కన్వర్టెడ్ బీసీ అంటూ బాంబు పేల్చారు…
2002 వరకు ఉన్నత వర్గాల్లో మోదీ ఉండేవాళ్లని ,మోదీ సీఎం అయ్యాక ఆయన కులాన్ని బీసీల్లో కలిపారని
మోదీ కులం గురించి ఆషామాషీగా చెప్పడం లేదని,అన్నీ తెలుసుకునే మోదీ కులంపై మాట్లాడుతున్నానని,
ఇక మీరే ఆలోచించుకోండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు..



