ఎంజీఎం లో ఆ కాంట్రాక్టర్ కు బిల్లులు మంజూరి చేసేందుకు ఎంజీఎం అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది…ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గత రెండు సంవత్సరాలుగా అటెండెన్స్ మస్టర్ లేకుండా,సరైన సిబ్బందిని నియమించ కుండా కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము ఆ కాంట్రాక్టర్ దిగమింగుతున్నాడని ఆరోపణలు బాగానే ఉన్నా కనీసం ఎలాంటి విచారణ చేయకుండా, ఉన్నతాధికారులకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ఎంజీఎం అధికారులు ఆ కాంట్రాక్టర్ కు వత్తాసు పలుకుతూ గుట్టుచప్పుడు కాకుండా బిల్లులు మంజూరి చేసేందుకు సిద్ధం అయినట్లు సమాచారం…కాగా ఈ బిల్లుల మంజూరి కోసం సెక్షన్ క్లర్క్ నుంచి ఓ అధికారి వరకు కాంట్రాక్టర్ తో కుమ్మక్కు ఐయినట్లు ఎంజీఎం లో ప్రచారం జరుగుతోంది…నిబంధనలు ఉల్లంఘిస్తున్న కాంట్రాక్టర్ కు అసలు బిల్లులు ఎందుకు మంజూరి చేస్తున్నారో వారికే తెలియాలి…ఈ బిల్లుల మంజూరి దందా పై విజిలెన్స్ విచారణ జరిపితే విషయాలన్నీ బయటికి వచ్చే అవకాశం ఉందని ఎంజీఎం లో చర్చ జరుగుతోంది… ఎంజీఎం అధికారులు కాంట్రాక్టర్ కు సంబంధించిన బిల్లుల విషయంలో వరంగల్ కలెక్టర్ కు తప్పుడు సమాచారం ఇస్తూ కాంట్రాక్టర్ కు లబ్ది చేకురుస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి… అటెండెన్స్ మస్టర్,తగినంత సిబ్బంది లేకున్నా ఇష్టారీతిన సాటిస్ఫ్యాక్టరీ సర్టిఫికెట్ ఇస్తూ రాష్ట్రంలో ఎక్కడ లేని విదంగా 96 శాతం సాటిస్ఫ్యాక్టరీ అంటూ అధికారులు సర్టిఫై చేస్తూ కాంట్రాక్టర్ అడుగులకు మడుగులొత్తుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి….



