సబ్ రిజిస్ట్రార్ నయా ప్లాన్…?

ఉన్నతాధికారుల అండదండలు ఓ యూనియన్ నాయకుడి సహకారంతో ఆ సబ్ రిజిస్ట్రార్ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి… హనుమకొండలో సబ్ రిజిస్ట్రార్ గా పనిచేసి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కావలసినన్ని రిజిస్ట్రేషన్లు అడ్డగోలుగా చేసిన అపవాదు మూటగట్టుకుని భారీగా వెనకేసుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొన్న ఆ సబ్ రిజిస్ట్రార్ అవినీతి ఆరోపణల నుంచి బయటపడేందుకు ఓ నయా ప్లాన్ కు తెరతీసినట్లు తెలుస్తోంది… తన పదవీ విరమణ కాలం కొన్ని నెలలు మాత్రమే ఉందంటూ జనగామ నుంచి ఓ మంత్రి నియోజకవర్గ కేంద్రానికి బదిలీపై వెళ్లిన ఆ సబ్ రిజిస్ట్రార్ విధుల్లో చేరకుండా సెలవు పెట్టి అవినీతి మరకలు కడుక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది… ఉద్యోగ కాలం ముగిసి పదవి విరమణ పొందితే తాను సర్వీస్ లో ఉండగా చేసిన అవినీతి సమస్య పోయి క్లీన్ చీట్ వస్తుందనే ప్లాన్ తో ఆ సబ్ రిజిస్ట్రార్ ఇప్పటికీ సెలవులోనే కొనసాగుతున్నట్లు సమాచారం… ఓ యూనియన్ నాయకుడితో అత్యంత సన్నిహితంగా ఉండే ఈ రిజిస్ట్రార్ అతడి సహకారంతో ఈ నయా ప్లాన్ కు తెరతీసినట్లు రిజిస్ట్రేషన్ శాఖలో ప్రచారం జరుగుతుంది.. కాగా హనుమకొండ జనగామ ప్రాంతాల్లో సబ్ రిజిస్ట్రార్ గా పనిచేసినప్పుడు అనేక అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన ఈ సబ్ రిజిస్ట్రార్ పై ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చిన ఉన్నతాధికారులు సైతం ఏలాంటి చర్యలు తీసుకోకుండా గమ్మున ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది… హనుమకొండలో సబ్ రిజిస్ట్రార్ గా చేసినప్పుడు ఆరోపణల నేపథ్యంలో స్టేషన్ ఘనపూర్ కు ఆ తర్వాత జనగామ కు బదిలీ చేశారే తప్ప ఆ సబ్ రిజిస్ట్రార్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శలు వస్తున్నాయి….కాగా ఈ హనుమకొండలో విధులు నిర్వహిస్తున్నప్పుడు అనేక అక్రమ రిజిస్ట్రేషన్లు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి ..కార్యాలయానికి సంబంధం లేకుండా కొంతమంది బయట వ్యక్తులతో సంబంధం పెట్టుకుని అడిగింది సమర్పిస్తే చాలు అనేక అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపణలు దండిగానే ఉన్నాయి …ఈ అక్రమ రిజిస్ట్రేషన్ లతో ఆర్థికంగా బాగానే వెనకేసినట్లు ఆ శాఖలోనే చర్చ సాగుతోంది.. నిఘావర్గాలు ఈ విషయంలో దృష్టి సారించి కూపీ లాగితే నిజాలు బయటపడడం ఖాయంగా కనిపిస్తోంది.అంతేకాదు ఈ సబ్ రిజిస్ట్రార్ చేసిన అక్రమ రిజిస్ట్రేషన్ లపై కథనాలు వెలుపడితే నోటికి పని చెప్పిఇష్టారీతిన మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది… తనకు ఉన్నతాధికారులు, ఓ యూనియన్ నాయకుడి అండదండలు ఉన్నంతకాలం తనను ఎవరు ఏం చేయలేరని ధీమా వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం ..పదవి విరమణ కాలం కొన్ని నెలలే ఉంది సెలవు పెడితే చాలు ఏ విచారణలు, చర్యలు ఉండవని ఈ సబ్ రిజిస్ట్రార్ ఇలాంటి నయా ప్లాన్ కు సిద్ధమై దానిని అమలు చేస్తున్నట్లు కనబడుతోంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here