ఏటీఎం మిషన్ లో డబ్బులు బయటకు రాకుండా ఇనుప రేకు అడ్డం పెట్టి చోరీలకు పాల్పడుతున్న రాజస్థాన్ కు చెందిన అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు. ఏటీఎం కేంద్రాలకు కన్నం వేసి చోరీలకు పాల్పడుతున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అంతర్ రాష్ట్ర ముఠా కు చెందిన ఏడుగురు నేరస్థులను సిసిఎస్, కాజీపేట పోలీసులు సంయుక్తంగా పట్టుకొని , వీరి నుండి పోలీసులు 5లక్షల 10వేల రూపాయల నగదు, రెండు కార్లు, ఏడు సెల్‌ఫోన్లు, నేరానికి వినియోగించే ఐరన్ ప్లెట్లను మరియు డూప్లికేట్ తాళం చెవులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితులు: 1.ఆరిఫ్ ఖాన్, వయస్సు23, ఖారెడా గ్రామము, 2. సర్ఫరాజ్ , వయస్సు 24, బీజ్వాడ నారోక గ్రామము, 3. యం.ఆష్ మహ్మద్, వయస్సు 29, 4. షాపుస్ ఖాన్, వయస్సు 33, మోరేడా గ్రామము, 5. షారూఖాన్, వయస్సు 33, మోరేడా గ్రామము, 6. అస్లాం ఖాన్,వయస్సు 33,మోరేడా గ్రామము, 7. యం.షారుఖాస్, వయస్సు 27, మహావకార్డ్, గ్రామము, సమీర్ ఖాన్, ఖారెడా గ్రామము, పోలీసులు అరెస్టు చేసిన నిందితులందరు మాల్కిడా తాలుకా, అల్వార్ జిల్లా, రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ అరెస్టుకు సంబందించి వరంగల్ సెంట్రల్ జోన్ డిసిపి కవిత వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్టు చేసిన నిందితులందరు ఒకే ప్రాంతానికి చెందినవారు కావడంతో వీరి మధ్య పరిచయం వుండటంతో నిందితులందరు కలిసి మద్యం సేవిస్తూ జల్సాలు చేసేవారు. ఈ సంపాదన వీరి జల్సాలకు సరిపోకపోవడంతో నిందితులు సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. ఇందుకోసం ఓ పరిచయస్తుడి ద్వారా ఎస్.బి.ఐ బ్యాంక్‌కు సంబంధించిన ఏటీయం కేంద్రాల్లో ఏర్పాటు చేసే మిషన్లకు సంబందించి perto కంపెనీ చెందిన ఏటీఎం మిషన్‌లో వున్న లోపాలను ఈ ముఠా సభ్యులు అధ్యానయం చేయడంతో పాటు, ఇలాంటి ఏటీఎం మిషన్ తెరుచేందుకు వీలుగా నకిలీ తాళం చెవులను తయారు చేసుకున్నారు. దీనితో ఈ ముఠా ముందుగా perto కంపెనీ చెందిన ఏటీఎం మిషన్ వున్న కేంద్రాలకు వెళ్లి సదరు ఏటీఎం కేంద్రంలోకి చోరబడి నిందితులు తమ వుద్ద వున్న నకిలీ తాళంతో ఏటీయం మిషన్ ముందు భాగంలో తెరిచి డబ్బులు బయటకు వచ్చే మార్గంలో ఏవరు గుర్తుపట్టని విధంగా ఓ ఇనుప ప్లెటును గమ్ పెట్టి అమర్చేవారు. ఈ విధంగా అమర్చడం ద్వారా బ్యాంక్ ఖాతాదారులు డబ్బు ఏటీయంలో డ్రా చేసుకునే సమయంలో డబ్బు డ్రా అయ్యే మార్గంలో ముఠా ఏర్పాటు చేసిన ఇనుప ప్లెటు కారణంగా ఏటీయం మిషన్ రావల్సిన డబ్బు బయటకు రాకుండా మిషన్ లోపలే నిలిపోవడం జరుగుతుంది. ఏటీయం మిషన్ నుండి డబ్బు బయటికి రాకపోవడంతో బ్యాంక్ ఖాతాదారుడు మిషన్ సమస్యగా భావించి అక్కడి నుండి వెళ్ళిన అనంతరం. అదే ఏటీయం పరిసర ప్రాంతాల్లో గమనిస్తూ వుంటూ వున్న ముఠా సభ్యులు ఖాతాదారుడు ఏటీయం కేంద్రం నుండి వెళ్ళిపోగానే ఈ ముఠా ఏటీయంలోకి వెళ్ళి తమ వద్ది వున్న తాళంతో ఏటీయం తెరచి అందులో నిలిచిపోయిన డబ్బును ముఠా చోరీ చేసేది. ఆ తరువాత ఖాతాదారుడుకి ఏటీయం సెంటర్ నుండి నగదు డ్రా చేసినట్లుగా ఫోన్‌కు మేసెజ్ రావడం కూడా జరుగుతుంది. ఆ తరువాత ఖాతాదారులు బ్యాంకు కు పిర్యాదు లు చేయడం జరిగింది. ఈ విధంగా నిందితులు రాజస్థాన్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడటం జరిగింది. ఈ తరహ చోరీలపై బ్యాంక్ అధికారులకు పలు ఫిర్యాదులు రావడంతో బ్యాంక్ అధికారులు perto కంపెనీ కి చెందిన పాత ఏటీయం మిషన్ స్థానంలో నూతన ఏటీయంలను ఏర్పాటు చేయడం ద్వారా ఈ ముఠా చోరీలు చేసేందుకు అవకాశాలు సన్నగిల్లడంతో ఈ ముఠా సభ్యులు ఈ తరహా ఏటీయం మిషన్లు వున్న ఇతర రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, అంద్రప్రదేస్, మధ్యప్రదేశ్, పంచిమ బెంగాల్ , కేరళ రాష్ట్రాల్లో మొత్తం 40 కి పైగా చోరీలకు పాల్పడ్డాడరు. ఇదే తరహా చోరీలు చేసేందుకు వరంగల్ ట్రై సిటికి రెండు కార్లలో చేరుకున్న ఈ ముఠా ముందుగా నగరంలో perto ఏటీయం మిషన్లు వున్న ఏటీయం కేంద్రాలు గుర్తించి గత నవంబర్‌తో నుండి ఇప్పటి వరకు 7 ఏటీయం కేంద్రాల్లో ఈ ముఠా సభ్యులు చోరీలకు పాల్పడి మొత్తం 12లక్షల 10వేల రూపాయల చోరీకి చేసారు. ఇందులో సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు చోరీలకు పాల్పడగా, కాజీపేట, హన్మకొండ, మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకటి చోప్పున చోరీకి పాల్పడ్డారు. నగదు పోయిన విషయం ఖాతాదారు సంబంధిత బ్యాంకు లలో పిర్యాదు చేయగా , బ్యాంకు వారు థర్డ్ పార్టీ అయిన ఎటిఎం సెక్యూరిటీ మరియు మెయింటెనెన్స్ చేసే సంస్ధ అయిన FSS LTD ( ఫైనాన్సియల్ సాఫ్ట్ వెర్ సెక్యూరిటీస్ లిమిటెడ్ )వాళ్లకు సమాచారం ఇవ్వగా వారు ఈ చోటీలపై పోలీసులకు ఫిర్యాదులు చేయగా అమ్రత్తమైన పోలీసులు, పర్యవేక్షణలో క్రైమ్స్ అదనపు డీసీపీ బాల స్వామి, క్రైమ్ మరియు కాజిపేట్ ఏసిపిలు సదయ్య, ప్రశాంత్ రెడ్డి అధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులకు అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకున్న పోలీసులు నిందితులను గుర్తించి వారిపై నిఘా పెట్టడం జరిగింది. నిందితులు ఈ రోజు ఉదయం కాజీపేట చౌరస్తా ప్రాంతంలోని PERTO కంపనీ కి చెందిన ఏటీయం కేంద్రాల్లో తిరిగి చోరీ చేసేందుకు కార్లలో వచ్చి ఎవరు లేని సమయములో ATM డోర్ ఓపెన్ చేసి దానికి స్టికర్ అతికించిన ఐరన్ ప్లేట్ ని బిగిస్తుండగా పోలీస్ వారు రాగ వారిని చూసి మేము పారిపోవుటకు ప్రయత్నం చేయగా పోలీసు వారు మమ్మల్ని వెంబడించి పట్టుకోని అదుపులోకి తీసుకోని విచారించగా నిందితులు పాల్పడిన చోరీలను అంగీకరించారు. వీరిని విచారిస్తున్న క్రమములో తెలింద ఏమిటంటే, వీళ్ళ లాగే కొంత మంది రాజస్థాన్ కు చెందిన యువత ముఠాలుగా ఏర్పడి దేశం లోని వివిధ రాష్ట్రాలలో ఇలాంటి నేరాలు చేస్తున్నారు అని తెలిసింది, ఇలాంటి నేరాలు జరుగుతున్నట్టు ఇప్పటి వరకు ఎక్కడ కూడా నేరాలు నమోదు కాలేదు, ఇలా నేరాలు జరుగుతున్నట్టు బ్యాంకు ఉన్నతాధికారులను వరంగల్ పోలీసులు అప్రమత్తం చేయడం జరిగింది . ఈ ముఠా సభ్యులను పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన పోలీస్ ఉన్నతాదికారులతో పాటు సిసిఎస్ ఇన్స్‌స్పెక్టర్ రాఘవేందర్, కాజీపేట్ ఇన్స్‌స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, ఏఏఓ సల్మాన్ పాషా, కాజీపేట ఎస్.ఐలు నవీన్‌కుమార్,లవణ్ కుమార్, సిసిఎస్ ఎస్.ఐ శ్రీనివాస్ రాజు, హెడ్ కానిస్టేబుళ్ళు మషేశ్వర్, శ్రీనివాస్ కానిస్టేబుళ్ళు విష్ణు, కుమారస్వామి, శ్రీధర్, హన్మంతు, వినోద్ లను వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించి రివార్డులను అందజేశారు.





