అన్ని కళ్ళు ఆ సభ పైనే

బీఆర్ఎస్ రజతోత్సవానికి పార్టీ నేతలు దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్టీ ఏర్పడి పాతికేళ్ల పడిలోకి అడుగు పెడుతుండటంతో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పార్టీ అధినేత ఆదేశాలతో ఉమ్మడి మెదక్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు జంక్షన్ గా ఉన్న ఎల్కతుర్తిని సభ నిర్వహణకు ఎంపిక చేసి, జన సమీకరణపై ఫోకస్ పెట్టారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్, వొడితల సతీశ్ కుమార్ ఆధ్వర్యంలో ఇప్పటికే పార్కింగ్ ఏర్పాట్లతో పాటు సభా వేదికను ముస్తాబు చేశారు.

20 వేల వాహనాలు..!

పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మందికిపైగా జనాలను తరలించేందుకు గులాబీ నేతలంతా ప్లాన్ చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి జనాలను తరలించేందుకు టీజీ ఎస్ఆర్టీసీ నుంచి 3 వేలకు పైగా బస్సులకు పర్మిషన్ కూడా తీసుకున్నారు. వాటితో పాటు ఇతర బస్సులు, కార్లు, లారీలు, డీసీఎంలు అన్ని కలిపి 20 వేలకుపైగా వెహికిల్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వైపులా నుంచి వచ్చే జనాలు, వాహనాల కోసం ఎల్కతుర్తి, చింతలపల్లి శివారులో దాదాపు 1250 ఎకరాలను సేకరించారు. అందులో సుమారు 154 ఎకరాల్లో సభా వేదికను ఏర్పాటు చేశారు. మిగతా వెయ్యికిపైగా ఎకరాలను పార్కింగ్ అవసరాల కోసం కేటాయించారు. ఈ మేరకు ఐదు జోన్లలో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.

2 వేల మంది వలంటీర్లు

రజతోత్సవ బహిరంగ సభకు ఐదు చోట్లా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయగా, వాహనాల మళ్లింపు, ఇతర సేవల కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 2 వేల మందికిపైగా వలంటీర్లను అందుబాటులో ఉంచారు మేరకు వారికి ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ ఇచ్చి వెహికిల్స్ మళ్లింపుతో పాటు జనాలకు అవసరమైన సేవలందించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే వారందరికీ ట్రైనింగ్ కూడా ఇచ్చినట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.ఎల్కతుర్తి వద్ద దాదాపు 1,250 ఎకరాల్లో సభనిర్వహించనుండగా.. సభా ప్రాంగణంలో 300కుపైగా లైటింగ్ స్టాండ్స్ ఏర్పాటు చేశారు. వాటికి విద్యుత్తు సరఫరా అందించేందుకు 200కుపైగా జనరేటర్లు పెడుతున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఇదిలాఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చే కరెంట్ పై తమకు నమ్మకం లేదని, అందుకే 200కుపైగా జనరేటర్లు ఏర్పాటు చేసినట్లు తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వ్యాఖ్యానించడం గమనార్హం.

వైద్య సేవల కోసం బృందాలు

సభకు 10 లక్షల మంది వరకు వస్తారని పార్టీ అంచనా వేస్తుండగా, ఎండల నేపథ్యంలో అక్కడ వందకు పైగా వైద్య బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ నేతలు పేర్కొన్నారు. అంతేగాకుండా ఎమర్జెన్సీ సేవల కోస అంబులెన్సులు, 10 లక్షల వాటర్ బాటిల్స్, 10 లక్షం మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో పెడుతున్నారు. అంతేగాకుండా ఎక్కడికక్కడ తాత్కాళిక టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు.రజతోత్సవ సభ నిర్వహణకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా, పార్టీ నేతలు జన సమీకరణపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్ఛార్జులను నియమించి, కార్యకర్తలతో సమావేశాలు కూడా నిర్వహించారు. ఇప్పటికే దూర ప్రాంతాల నుంచి ప్రభ బండ్లతో పాటు పాదయాత్రలతో పార్టీ కార్యకర్తలు ఎల్కతుర్తి సభా ప్రాంగణానికి బయలుదేరారు. రేపు (27వ తేదీ) సాయంత్రం వరకు సభ ప్రారంభం కానుండగా, సాయంత్రం 4 గంటలలోగా కార్యకర్తలు సభా ప్రాంగణానికి చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని పార్టీ నేతలు సూచిస్తున్నారు.

సరికొత్త చరిత్రను సృష్టించబోతోంది

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కేటీఆర్

ఓరుగల్లు వేదికగా జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ సైనికులతో పాటు తెలంగాణ సబ్బండవర్గాల ప్రజలు లక్షలాదిగా తరలిరావాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ ముఖ్యనేతలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ప్రతి గ్రామంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి ఉదయాన్నే గులాబీ జెండాలు ఆవిష్కరించి కదలిరావాలని సూచించారు.పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక సభ కావడంతో, సభకు హాజరయ్యే వారు గులాబీ రంగు దుస్తులు ధరించి రావాలని కోరారు. రాష్ట్ర నలుమూలల నుంచి సభకు తరలిరావాలనే ఉత్సాహం ప్రజల్లో పెద్ద ఎత్తున ఉందని, వారందరినీ సమన్వయం చేసుకొని అనుకున్న సమయానికి సభా ప్రాంగణానికి చేరుకునేలా ప్రణాళిక వేసుకోవాలని తెలిపారు.పార్టీ సిల్వర్ జూబ్లీ సభకు తరలివచ్చే ప్రతి వాహనానికి అన్ని వైపులా గులాబీ జెండాలు కట్టుకుని ఉత్సాహంగా బయలుదేరాలని సూచించారు. ఎండల వల్ల ఇబ్బంది లేకుండా ప్రతి బస్సులో మంచినీళ్ల బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, భోజన వసతులకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.తెలంగాణ నలువైపుల నుంచి తరలివచ్చే వాహనాలు ట్రాఫిక్ జామ్ కాకుండా ఇప్పటికే రూట్ మ్యాప్ పంపించామని, దానికి అనుగుణంగానే ఆయా రూట్లలో సభ స్థలికి చేరుకోవాలని పేర్కొన్నారు. సభా ప్రాంగణానికి 30 కిలోమీటర్ల దూరం నుంచి రోడ్లపై ఎక్కడ వాహనాలు నిలపరాదని, నేరుగా సూచించిన పార్కింగ్ స్థలాలకు చేరుకొని వాహనాలను నిలపాలని సూచించారు.అనేక ప్రాంతాల్లో పార్టీ వాలంటీర్లు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేయడానికి సిద్ధంగా ఉంటారని తెలిపారు. సభకు చేరుకునే వారందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి చోట మంచినీటి బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందించేందుకు వాలంటీర్లు సిద్ధంగా ఉంటారని తెలిపారు. చారిత్రక సభలో కేసీఆర్ గారి ప్రసంగంపై అన్ని వర్గాల్లో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొని ఉందని, రాష్ట్ర రాజకీయాల్లో ఈ సభ సరికొత్త చరిత్రను సృష్టించబోతోందని కేటీఆర్ స్పష్టం చేశారు.

బి. ఆర్. ఎస్ రజతోత్సవ మహా సభకు భారీగా పోలీస్ బందోబస్త్

రేపు ఎల్కతుర్తిలో నిర్వహించబడే బి. ఆర్. ఎస్ రజతోత్సవ మహా సభకు భారీగా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయడం జరుగుతోంది 1100 మందికి పైగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో ఇద్దరు డీసీపీలు, ఇద్దరు అదనపు డిసీపీలు, 8మంది ఏసీపీలు,28మంది ఇన్స్ స్పెక్టర్లు /ఆర్. ఐలు,66 ఎస్. ఐలు, 137 ఏ. ఎస్. ఐ లు / హెడ్ కానిస్టేబుళ్ళు,511కానిస్టేబుళ్ళు, 200 హోంగార్డ్స్ తో పాటు డిస్ట్రిక్ట్ గార్డ్స్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు

అన్ని కళ్ళు ఆ సభ పైనే- news10.app
అన్ని కళ్ళు ఆ సభ పైనే- news10.app
అన్ని కళ్ళు ఆ సభ పైనే- news10.app
అన్ని కళ్ళు ఆ సభ పైనే- news10.app
అన్ని కళ్ళు ఆ సభ పైనే- news10.app
ముస్తాబైన సభా ప్రాంగణం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here