తెలంగాణలో మొత్తం 230 మంది పాకిస్థానీయులు ఉన్నారని రాష్ట్ర డీజీపీ జితేందర్ అన్నారు..వీరిలో 199 మందికి లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నాయని.. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఈ లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నవారి జోలికి వెళ్లట్లేదని ఆయన తెలిపారు..
మిగిలిన 31 మందికి షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నాయని,షార్ట్ టర్మ్ వీసాలు ఉన్న వారిని తాము గుర్తిస్తున్నామని,లీవ్ ఇండియా పేరుతో ఇప్పటికే కొంతమందికి నోటీసులు ఇచ్చామని.. హెల్త్ బేస్ మీద వీసాలు తీసుకున్న వారికి ఈ నెల 29 వరకు టైం ఉందని చెప్పారు డీజీపీ..మిగిలిన వారు ఆదివారం తిరిగి వెళ్లిపోవాలని.. ఈ నెల 30 వరకు అటల్ బోర్డర్ నుండి వెళ్లిపోవచ్చని డీజీపీ జితేందర్ తెలిపారు..



