కార్మిక శాఖలో లీకు వీరుడు…?

కార్మిక శాఖలో ఓ అధికారి లీకు వీరుడి అవతారం ఎత్తినట్లు తెలుస్తుంది… తన కార్యాలయం రహస్యాలను తానే కొంతమందికి చేరవేస్తూ అంతా సరిచేసుకోండి అంటూ కొందరికి ఫోన్లు చేసి మరి ఉచిత సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తుంది… తనిఖీ ల పేరుతో అందినకాడికి దండుకొని బాగానే వెనకేస్తున్న ఈ అధికారి ప్రశ్నిస్తే కేసులు పెట్టండి అని కొంతమంది వ్యాపారులకు సలహాలు ఇస్తూ ఇష్టారాజ్యాంగ వ్యవహారిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి… పరకాల డివిజన్ లో అధికారిగా పనిచేస్తున్న ఈ అధికారి తాజగా ఓ పౌల్ట్రీ ఫాం యజమానికి తన శాయశక్తుల సహకరిస్తు లీకు వీరుడిలా అన్ని విషయాలు చేరవేస్తున్నట్లు తెలిసింది… మీ పౌల్ట్రీ ఫాం కు రేపు తనిఖీ చేయడానికి వస్తున్న ఏవైనా తప్పులు ఉంటే సరి చేసుకోండి అంటూ సదరు పౌల్ట్రీ యజమానికి ముందుగానే సమాచారం ఇచ్చి ఈరోజు తనిఖీ చేసేందుకు లేబర్ అధికారి ముహూర్తం పిక్స్ చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం… అంతేకాదు గత కొద్దిరోజుల క్రితం ఇదే పౌల్ట్రీ లో తనిఖీలు చేసిన ఈ అధికారి కార్ లోనే కూర్చుండి ఆమ్యామ్య స్వీకరించి కార్యాలయం బాట పట్టినట్లు తెలియవచ్చింది… ఇప్పటికే పౌల్ట్రీ యజమాని నుంచి కావాల్సింది అందింది కనుక ఆ విశ్వాసం తో తనిఖీ కి వస్తున్నా అని ముందే లీక్ చేసి పౌల్ట్రీ యజమాని కి సహకరిస్తున్నట్లు తెలుస్తుంది… బాల కార్మికుల విషయంలో ఈ పౌల్ట్రీ పై అనేక అనుమానాలు, ఆరోపణలు ఉన్న నేపథ్యంలో లేబర్ అధికారి పౌల్ట్రీ యాజమాన్యానికే సహకరిస్తున్నట్లు తీవ్ర విమర్శలు వస్తున్నాయి…

ఆ పౌల్ట్రీ బాల కార్మికుల అడ్డా …?

బీహార్ టు తెలంగాణ

టేకే దార్ రంగీలా మాయ.. నకిలీ ఆధార్ కార్డులతో బురిడీ…?

అన్నివిధాలా సహకరిస్తున్న లేబర్ అధికారి…?

బాల కార్మికులు ఉన్నారా…? అని మీడియా ప్రశ్నిస్తే  జర్నలిస్ట్ లపై కేసులు పెడదామని ఉచిత సలహా..?

పూర్తి ఆధారాలతో న్యూస్ 10 విశ్వసనీయ కథనం

కార్మిక శాఖలో లీకు వీరుడు...?- news10.app

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here