కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. పార్టీ కి రాజీనామా చేసిన అనంతరం తన మద్దతుదారులతో ఏర్పాటు చేసిన సమావేశం లో సీఎం తీరుపై ఆయన నిప్పులు చెరిగారు.. వేం నరేందర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ కి ఎం చేశారని పదవులు కట్టబెట్టారని ప్రశ్నించారు.. రేవంత్ కాంగ్రెస్ పార్టీ నాది అనే భావనలో ఉన్నారని అందుకే అందరిని తొక్కుతా అంటున్నారని అన్నారు… ఎంతమందిని తొక్కుతారో తాను చూస్తానని రేవంత్ ను ఎదిరించి తాను పోరాటం చేస్తానని జీవన్ రెడ్డి అన్నారు..ఎంతమందిని తొక్కుతావయ్య నువ్వు రేవంత్ రెడ్డి నీ తొక్కుడు కాదు రేవంత్ రెడ్డి.. ఈ జగిత్యాలలో ఏ శక్తి నన్ను ఆపలేదని జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు…





