భార్య ఆత్మహత్య చేసుకోవడంతో మనస్థాపం.. భార్య మృతికి తానే కారణం అంటూ గ్రామస్తులు దాడికి దిగడం తో… మరింత మానసిక కుంగుబాటు వెరసి ఆ ఎస్సై ఆత్మహత్యకు కారణం ఐయ్యాయి.. ఆరు సంవత్సరాలు, పది సంవత్సరాల వయస్సు కలిగిన ఇద్దరు కుమారులు, ఎస్సై ఉద్యోగం, చిన్నారుల భవిష్యత్ ను తీర్చిదిద్దే బాధ్యత…ఇవన్నీ ఏవి ఆలోచించకుండా కరీంనగర్ టు టౌన్ ఎస్సై చంద్ర శేఖర్ తన అత్తవారి ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు… సమస్యల నుండి బయటపడేందుకు తన స్టేషన్ కు వచ్చే వారికి కౌన్సిలింగ్ చేసి సమస్యలకు పరిష్కారం చూపే ఎస్సై తానే ధైర్యాన్ని కోల్పోయి ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడడంతో అందరు ఎంత పనిచేసావ్ ఎస్సై అంటూ ఆవేదన చెందుతున్నారు… కరీంనగర్ టు టౌన్ ఎస్సై గా పనిచేస్తూ వన్ టౌన్ లోని హనుమాన్ నగర్ లో నివాసం ఉంటున్న ఎస్సై చంద్రశేఖర్ కు పోలీస్ శాఖ లో సౌమ్యుడిగానే పేరుంది…తన భార్య దివ్య ఐదు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోగ అంత్యక్రియలకు ఎస్సై చంద్రశేఖర్ తన అత్తవారి స్వగ్రామం ఐయినా సీతంపేట కు వెళ్ళాడు… దివ్య మృతితో ఆవేదనతో ఉన్న కొందరు గ్రామస్తులు ఎస్సై ని నిలదీసారు ఇంకొందరు దాడికి యత్నించారు… ఈ దాడిని ఎస్సై మామ అడ్డుకున్నారు… ఆరోజు నుంచి అత్తవారింట్లోనే ఉన్న ఎస్సై శనివారం ఆత్మహత్య చేసుకోవడంతో బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు… తల్లితండ్రులు ఇద్దరు ఆత్మహత్య చేసుకొని మృతి చెందడంతో పసిప్రాయం లోనే తల్లిదండ్రులను కోల్పోయిన వారిని చూసి కుటుంభ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు..సమస్యలు వచ్చినపుడు ఎదిరించి నిలవాలి, ప్రతి సమస్యకు ఓ పరిష్కార మార్గం ఉంటుంది… సమస్య వచ్చినపుడు సన్నిహి తులతో మాట్లాడడం, పరిష్కార మార్గం వెతుక్కోవడం అవసరం అంతేగాని సమస్యలకు క్రుంగి పోయి విలువైన జీవితాన్ని కోల్పోవద్దని మానసిక నిపుణులు చెబుతున్నారు…




