కేంద్రం ,రాష్ట్రం కలిసి నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.టి డి పి,.కాంగ్రెస్ కలిసి పాలమూరును నిర్లక్ష్యం చేశారని..వీరివల్లే పాలమూరు దారిద్య్రం లోకి నెట్టివేయబడిందని అన్నార ..తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లా వివక్షకు గురైందని,. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై ప్రధానంగా చర్చించామని. కేంద్ర రాష్ట్రాలు తెలంగాణకు చేస్తున్న ద్రోహంపై చర్చించామన్నారు… మహబూబ్‌నగర్ జిల్లాలో 308 కి.మీ కృష్ణా నది పారుతుందని,. ఆనాటి ప్రతిపాదిత ప్రాజెక్టుల ప్రకారం 174 TMCల నీళ్లు పాలమూరు జిల్లాకు రావాలని,. ఏపీ ఏర్పాటుతో మహబూబ్‌నగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని కేసీఆర్ అన్నారు….తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు వెనకవేయబడ్డ ప్రాంతమని కేసీఆర్ అన్నారు…పాలమూరు కరువుతో లక్షలమంది ముంబై కి వలస వెళ్లారని అన్నారు…300 కిలోమీటర్లు కృష్ణా నది ప్రవహించే పాలమూరు జిల్లాలో గతంలో 30 ఎకరాలకు కూడా సాగునీరు లేదని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరున్నర లక్షల ఎకరాలు సాగులోకి తెచ్చి అనేక చెక్ డ్యామ్ లు సైతం నిర్మాణం చేశామన్నారు…



