ప్లెక్సీ విషయంలో మొదలైన వివాదం కాల్పులకు దారితీసింది.. కర్ణాటక బళ్ళారి లో మాజీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి పై కాల్పులు కలకలం రేపాయి…ఎమ్మెల్యే సతీష్ రెడ్డి అనుచరులు,జానారెడ్డి అనుచరుల మధ్య ఓ ప్లెక్సీ విషయంలో గొడవ చెలరేగడంతో ఎమ్మెల్యే సతీష్ రెడ్డి అనుచరుడు గాలి జనార్ధన్ రెడ్డి గన్ మెన్ వద్ద తుపాకి లాక్కొని కాల్పులు జరిపి ట్లు తెలిసింది…ఈ కాల్పుల నుంచి గాలి జనార్దన్ రెడ్డి తప్పించుకోగా ఓ కాంగ్రెస్ కార్యకర్త మృతి చెందాడు…ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కాల్పులు జరుప కోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి… రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరు వర్గాలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు..కాగా ఈ ఘటన పై స్థానిక పోలీస్ శాఖ బ్రూస్‌పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే జనార్ధన్‌రెడ్డి, శ్రీరాములు, సోమశేఖర్‌రెడ్డి తదితర మొత్తం 11 మందిని నిందితులుగా నమోదు చేసినట్లుస్థానిక పోలీసులు తెలిపారు..



