కర్ణాటక మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డిపై కాల్పులు..బళ్లారి లో టెన్షన్ టెన్షన్
తన ఇంటి ప్రహరికి ఫ్లెక్సీలు కట్టొద్దని చెప్పినందుకు, గాలి జనార్ధన్ రెడ్డి అతని అనుచరులపై కాల్పులు జరిపిన బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచరుడు
కర్ణాటక రాష్ట్రం బళ్లారిలోని హవంబావి ప్రాంతంలో ఒక కార్యక్రమానికి సంబంధించి గాలి జనార్ధన్ రెడ్డి ప్రహరికి ఫ్లెక్సీలు కట్టేందుకు ప్రయత్నించిన స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి
ఫ్లెక్సీలు ఇంటి ప్రహరికి వద్దని, బయట కట్టుకోవాలని సతీష్ రెడ్డికి తెలిపిన గాలి జనార్ధన్ రెడ్డి అనుచరులు
దీంతో గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి ముందు కూర్చి వేసుకుని కూర్చున్న సతీష్ రెడ్డి, నేను ఫ్లెక్సీలు ఇక్కడే కడతానని.. ఎవడు ఆపుతాడో చూస్తా అని అనడంతో, ఇరువర్గాల మధ్య మొదలైన రాళ్ల దాడి
అదే సమయంలో ఇంటికి వచ్చిన గాలి జనార్ధన్ రెడ్డి గన్ మెన్‌లు ఉద్రిక్తతను ఆపేందుకు గాల్లోకి కాల్పులు జరపగా, ఒక గన్ మెన్ నుండి తుపాకీ లాక్కొని గాలి జనార్ధన్ రెడ్డి వైపు కాల్పులు జరిపిన సతీష్ రెడ్డి
దీంతో ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు రాజశేఖర్ రెడ్డి మృతి చెందగా, బుల్లెట్ గాయంతో తప్పించుకున్న సతీష్ రెడ్డి
కాల్పుల నుండి ఎలాంటి గాయాలు లేకుండా బయటపడి, భరత్ రెడ్డి అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన గాలి జనార్ధన్ రెడ్డి
ఈ ఘటన అనంతరం స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో, పెద్ద ఎత్తున రంగంలోకి దిగి ఇరు వర్గాలను అదుపు చేసిన పోలీసులు



