గోదాం లో బియ్యం మాయం…

వరంగల్ జిల్లా పౌరసరఫరాల శాఖలో గందరగోళం నెలకొంది… మొన్నటివరకు మిలర్లు సి ఎం ఆర్ పెట్టకుండా దాన్యం పక్కదారి పట్టి సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు వస్తే ఇప్పుడు ఏకంగా పౌరసరఫరాల శాఖ లోని ఉద్యోగులు సైతం తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తుంది… తాజాగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కు చెందిన గోదాం లో బియ్యం మాయం ఐనట్లు తెలిసింది.. పౌరసరఫరాల శాఖ కు చెందిన ఓ మహిళ ఉద్యోగి ఈ బియ్యాన్ని మాయం చేసి సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గ్రామంలో ఉన్న ఈ గోదాం లో ఉన్న బియ్యం నిల్వల్లో సుమారు రెండు వందల బస్తాల దాన్యం వంద క్వింటాళ్ల బియ్యం మాయం ఐయినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం…

రంగంలోకి టాస్క్ పోర్స్…

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కు చెందిన గోదాం లో బియ్యం మాయం కావడంతో రంగలోకి దిగిన టాస్క్ పోర్స్ తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం… ఇక్కడి గోదాం లో తనిఖీలు నిర్వహించిన టాస్క్ పోర్స్ బియ్యం షార్ట్ పాల్ ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది… బియ్యం మాయం కావడానికి ఇక్కడ పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్, మరో ఉద్యోగి కారణమని టాస్క్ పోర్స్ విచారణలో తేలినట్లు విశ్వసనీయ సమాచారం…

పోలీస్ స్టేషన్ లో పిర్యాదు…

చలపర్తి గ్రామం లోని గోదాం లో మాయం ఐయిన బియ్యం విషయంలో దుగ్గొండి పోలీస్ స్టేషన్ లో అధికారులు పిర్యాదు చేసినట్లు తెలిసింది… వరంగల్ జిల్లా పౌర సరఫరాల శాఖ డి ఎం సంధ్యరాణి పిర్యాదు చేయగ పోలీసులు ఇంకా ఎఫ్ ఐ ఆర్ చేయలేదని తెలియవచ్చింది… కాగా బియ్యం మాయం విషయంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా ఉద్యోగిని కాపాడేందుకు కొందరు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here