ఎన్ని ఏసీబి దాడులు జరిగిన, ఎన్నిసార్లు పోలీసులు అదుపులోకి తీసుకున్న హన్మకొండ ఆర్టీఏ కార్యాలయం వద్ద ఏజెంట్ల ఆగడాలు తగ్గేలా కనిపించడం లేదు… ఒక్కో అధికారికి ఒక్కో ఏజెంట్ చొప్పున ఇక్కడ వసూళ్ల దందా నిడిపిస్తూ అధికారులకు కమిషన్ల కాసులు కురిపిస్తూ జేబులు నిపుతున్న ఏజెంట్లు ఆర్టీ ఏ కార్యాలయం ప్రాంగణం లో తన్నులాట కు దిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది… డి టి సి కి ఎజెంట్లు గా వ్యవహారిస్తున్న ఓ ఇద్దరు ఎజెంట్లు తమ కమిషన్ల విషయం లో గొడవకు దిగగ ఈ గొడవ చివరకు తన్నులాట వరకు వెళ్లినట్లు సమాచారం… ఈ ఇద్దరు ఏజెంట్లు ఇక్కడ పనిచేస్తున్న డి టి సి కే కాకుండా తన ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తూ డి టి సి కి కుడి భుజం అంటూ పేరున్న వసూళ్ల కిషోరం ఎం వీ ఐ కి సైతం ఈ ఇద్దరే ఏజెంట్లు గా వ్యవహారిస్తున్నట్లు తెలిసింది.. ఈ ఏజెంట్ల తన్నులాట విషయం పోలిస్ స్టేషన్ కు చేరగా పోలీసుల రాకతో ఈ ఇద్దరు ఏజెంట్ల తో సహా ఇతర ఏజెంట్లు సైతం అక్కడినుంచి మాయం అయినట్లు తెలిసింది.. పోలీసుల రాకతో అక్కడినుంచి మాయమైన ఏజెంట్లు విషయం సద్దుమణగగానే మళ్ళీ సాయంత్రం కార్యాలయం వద్దకు చేరుకొని కమిషన్ల దందా చక్కబెట్టి రోజువారి పంపకాలు నిర్వహించి అధికారుల వాటాలు పువ్వుల్లో పెట్టి అప్పగించినట్లు తెలియవచ్చింది… కాగ కమిషన్ల వ్యవహారం లో ఈ తన్నులాట ఘటన ఇదే నెలలో మూడు సార్లు జరిగినట్లు తెలిసింది… కాని ఈ విషయంలో తమ వసూళ్ల కోసం ఏజెంట్ల ను నియమించుకున్న ఆ ఇద్దరు అధికారులు మాత్రం తమ వాటాలు తమకు వస్తున్నాయి తన్నులాట తో మాకేం సంబంధం అన్నట్లు వ్యవహారిస్తున్నట్లు తెలుస్తుంది…
వసూళ్ల కిషోరం ఆ ఎం వి ఐ అంతే…?
ఇదిగో ఆ ఇద్దరు ఎజెంట్ల వసూల్ దందా..!!
ఏజెంట్ల ద్వారా పెద్ద సారు వసూళ్ళు…?
మరో సంచికలో…



