చిన్నారులకు విముక్తి

ఆపరేషన్ స్మైల్ ద్వారా 177 చిన్నారులకు విముక్తి

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

ఆపరేషన్ ముస్కాన్ 11వ విడత ద్వారా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో పనులు చేస్తున్న 177 చిన్నరులకు విముక్తి కలిగించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. గత నెల జులై మొదటి తారీఖు నుండి నెలాకరు వరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు బాలల సంరక్షణ విభాగం, చైల్డ్ లైన్, కార్మిక శాఖతో కలిసి ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో బాల కార్మికులు, బడి మానేసిన 177 మంది బాలబాలికలను గుర్తించి వారిని బాలల సంరక్షణ గృహానికి తరలించడం జరిగింది.ఇందులో 149 మంది బాలలు, 28 మంది బాలికలు వున్నారు. బాలల సంరక్షణ గృహానికి తరలించిన వారిలో తెలంగాణతో , ఇతర రాష్ట్రాలకు 97మంది చిన్నారులు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. ఈ తనిఖీల్లో గుర్తించిన 171 చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగించడమైదని పోలీస్ కమిషనర్ తెలిపారు.
ఈ తనిఖీలు కొనసాగుతాయని. ఎవరైనా చిన్నారులతో వెట్టి చాకిరీ చేయించుకునే యాజమానుల పట్ల కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై బాలల న్యాయ చట్టం అనుసరించి చిన్నారులను పనిలో పెట్టుకున్న యాజమాన్యంకు రెండు సంవత్సరాల జైలు శిక్ష, 50వేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here