జర్నలిస్టు లపై ఎమ్మెల్యే రేవూరి చిందులు  (వీడియో)

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి జర్నలిస్టులపై చిందులు తొక్కారు… పరకాల పట్టణంలో బస్టాండ్ చుట్టూ ఆక్రమణకు గురై ఏర్పాటు చేసిన పండ్ల దుకాణాలు, తోపుడు బండ్ల వల్ల ట్రాఫిక్ జామ్ కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని తొలగించి వాటి స్థానం లో ఆర్టీసీ అధికారులు పెన్షింగ్ వేయించారు…దింతో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే  బస్టాండ్ ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చినపుడు ట్రాపిక్ విషయం పై ప్రస్తావించగా ఎమ్మెల్యే కు కోపం వచ్చింది… మీరు అడ్వకేట్ల, వకాలాత్ వేస్తారా…? చేతిలో ఒకటి ఉండగానే విలేఖరా…? చెప్పింది రాసుకోవాలి… వినాలి అంటూ హితబోధ చేసే ప్రయత్నం చేస్తూ చిందులు తొక్కారు ఆయనతో పాటు ఉన్న ఇతర నాయకులు సైతం జర్నలిస్ట్ లను అవమానించే ప్రయత్నం చేశారు…

జర్నలిస్ట్ లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే రేవూరి

జర్నలిస్ట్ ల ఆగ్రహం…

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్థానిక
జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు.పరకాల బస్టాండ్ వద్ద ఆక్రమణల తొలగింపును పరిశీలించేందుకు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అధికారులతో కలిసి బస్టాండుకు వచ్చిన క్రమంలో స్థానిక జర్నలిస్టులు ట్రాఫిక్ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేయగా దురుసు మాటలతో చిందులు వేశారు.జర్నలిస్టులు ఐతే ఏంటి..?
ఎవరికి వకల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారని దురుసుగా వ్యవహరించారు.
ప్రజలకోసం వకల్లా తీసుకుంటున్నామని చెప్పబోయె ప్రయత్నం చేయగా మళ్ళీ ఆగ్రహింతో ఊగిపోయారు.
ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ జర్నలిస్టులు న్యూస్ కవరేజి చేయకుండా బయటకు వచ్చారు.ఎమ్మెల్యే వ్యాఖ్యలు అప్రజాస్వామికం
వెంటనే క్షమాపణ చెప్పాలని
ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని జర్నలిస్టులు తీవ్రంగా ఖండిస్తూ అమరదామంలో అత్యవసర సమావేశం
ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు చొళ్ళేటి సునేందర్,నేరళ్ళ పరుశురాం,బలేరావు బాబ్జీ, రావుల రాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే వ్యాఖ్యలు అప్రజాస్వామికం అన్నారు.ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులపై ఎమ్మెల్యే నోరు పారేసుకోవడం
గర్హనీయం అన్నారు.ఎవరి వకాల్తా పుచ్చుకున్నారని జర్నలిస్టులపై నోరు పారేసుకున్న ఎమ్మెల్యే ప్రస్తుతం ఎవరి వకాల్తా పుచ్చుకుని బస్టాండ్ ఆక్రమణల ఇనుప కంచ తొలగించారని జర్నలిస్టులు ప్రశ్నించారు.స్వార్ద రాజకీయాల కోసం పరకాల ప్రజల ప్రయోజనాలను పణంగా పెడుతూ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి జర్నలిస్టులపై
చిందులు తొక్కుతూ ప్రజాస్వామిక విలువలను తుంగలో తొక్కారని తీవ్రంగా విమర్శించారు.ఈ సమావేశంలో కోగిల చంద్రమౌళి,శ్రీరామోజు వేణు,గూడెల్లి నాగేంద్ర,గూడెల్లి కార్తీక్,ఐలి విజయ్,బోజ శ్రీనివాస్ రెడ్డి,చిర్ర సతీష్,సత్యం, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here