జుట్టు పట్టి ఈడ్చికొట్టి… ప్రిన్సిపాల్ బూతు పురాణం

విద్యార్థినుల రెండు జుట్లు ముడివేసి చేతితో పట్టుకొని తిప్పి తిప్పి కొట్టింది… విద్యార్థినులు కింద పడితే కాళ్లతో తన్నుతూ పైకి లెమ్మని బెదిరించింది… 11 మంది విద్యార్థినులను ఇష్టం వచ్చినట్లు తిట్టి కొట్టింది”

మడికొండ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల, కళాశాలలో ఆ ప్రిన్సిపాల్ ఇష్టారాజ్యాంగ వ్యవహారిస్తూ ఇక్కడ విద్యానభ్యసిస్తున్న విద్యార్థినులను బూతులు తిడుతున్నట్లు వారు ఆరోపిస్తున్నారు…మంగళవారం ఉదయం కొంతమంది విద్యార్థినులను జుట్టు పట్టుకొని కొట్టగ విద్యార్థినులు రోడ్డెక్కారు… సుమారు వందకు పైగా విద్యార్థినులు ప్రిన్సిపాల్ వ్యవహారం పై హన్మకొండ జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేయడానికి ర్యాలీగా బయలుదేరగా వారిని పోలీసులు అడ్డుకోగా రోడ్డు పై బైఠాయించారు… ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు… దింతో అధికారులు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు… విద్యార్థినులు ససేమిరా అనడంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న సి డి పి ఓ, ఖాజీపేట తహసీల్దార్ ఇతర అధికారులు ప్రిన్సిపాల్ వ్యవహారం పై వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రిన్సిపాల్ జుట్టు పట్టుకొని కొట్టారని, కింద పడిపోయిన తమను కాళ్ళతో తొక్కి పైకి లెమ్మని బెదిరించిందని… విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు… ప్రిన్సిపాల్ కులం, మతం అంటూ దూషిస్తుందని వారు అంటున్నారు…

ప్రిన్సిపాల్ బూతు పురాణం,ఇష్టారాజ్యం పై పూర్తి కథనం న్యూస్10 ఈరోజు సాయంత్రం సంచికలో….

జుట్టు పట్టి ఈడ్చికొట్టి... ప్రిన్సిపాల్ బూతు పురాణం- news10.app
సాయంత్రం సంచికలో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here